Telangana: కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ కొనసాగింపు.. పొంగులేటి ప్రకటన

గత ప్రభుత్వం అప్పులభారాన్ని తమ నెత్తిన పెట్టినా.. సంక్షేమం,అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ వెళ్తున్నామని మంత్రి పొంగులేటి అన్నారు. వెయ్యి రోజుల్లో అభివృద్ధి, సంక్షేమం అందించామని, భేషజాలకు పోకుండా.. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ను కొనసాగిస్తున్నామని చెప్పారు. రూ.40 వేల కోట్ల పెండింగ్‌ బిల్లులు చెల్లిస్తున్నామని, సర్పంచ్‌ల బాకీలను కూడా తాము చెల్లించామని పొంగులేటి స్ఫష్టం చేశారు.

Telangana: కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ కొనసాగింపు.. పొంగులేటి ప్రకటన
Ponguleti Srinivas Reddy

Updated on: Sep 02, 2026 | 2:57 PM

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు. వెయ్యిరోజుల పాలన సూపర్‌ హిట్‌ అని, ఆర్థిక పరిస్థితి బాలేకపోయినా సుపరిపాలన అందించామని తెలిపారు. గత పాలనలో రూ.8 లక్షల కోట్లకుపైగా అప్పులు చేశారని ఎద్దేశా చేశారు. గత ప్రభుత్వం అప్పులభారాన్ని మా నెత్తిన పెట్టినా.. సంక్షేమం,అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ వెళ్తున్నామని, వెయ్యి రోజుల్లో అభివృద్ధి, సంక్షేమం అందించామని తెలిపారు. భేషజాలకు పోకుండా.. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ను కొనసాగిస్తున్నామని, రూ.40 వేల కోట్ల పెండింగ్‌ బిల్లులు చెల్లిస్తున్నామని స్పష్టం చేశారు. సర్పంచ్‌ల బాకీలను కూడా తాము చెల్లించామని పొంగులేటి చెప్పారు. పంజాబ్‌ని మంచి వరి ఉత్పత్తి చేశామని, కాళేశ్వరం కూలిన తర్వాతనే తెలంగాణ ఈ రికార్డు సాధించిందని అన్నారు.

“ప్రతీ పంటలో రైతులకు భద్రత, భరోసా కల్పిస్తోంది. ఆ నాటి దోర వరేస్తే ఊరే అన్నారు. ఇవాళ సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ అందిస్తున్నాం. చావు నోటి దాకా వెళ్లోచ్చామన్నవారు అధికారం వచ్చాక నిరుద్యోగులను మోసం చేస్తూ పేపర్ లీక్స్ చేశారు. టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేస్తూ పారదర్శకంగా ఉద్యోగాలిచ్చాం. ఉద్యోగాలు ఇవ్వడం అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. అప్పులతో అప్పచెప్పినా ప్రతీ హామీని చిత్తశుద్దితో నెరవేరుస్తున్నాం. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని ప్రజలకు కూడా తెలుసు. ఓపెన్‌గా బీజేపీతో జతకడితే అంతా సంతోషిస్తాం. ఒక్క కార్యక్రమాన్ని కూడా మెచ్చుకోరు. వారి సంస్కృతి అలాంటిది. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. అటువంటి రిజల్స్ చూసైనా వారు మారడం లేదు. గ్రామ పంచాయతీలను సైతం కాంగ్రెస్ గెలిచింది. పట్టణాల్లో మా పార్టీ బలంగా ఉందన్నారు. అక్కడ కూడా మేమే గెలిచాం” అని పొంగులేటి పేర్కొన్నారు.

“ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు గుండుసున్నా. కేంద్ర ప్రభుత్వం వీరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని ఓట్లు వేయించారు. బతుకమ్య చీరల్లో కూడా అవినీతి చేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక సారె రూపంలో సీఎం పంపారు. పాలపిట్ట చీరలను మహిళలంతా కట్టుకుంటున్నారు. రాబోయే రోజుల్లో చిలకపచ్చ చీరలను సైతం ఇస్తున్నాం. రాహుల్ గాంధీని యాడ సచ్చించు అని అంటున్నారు. మిమ్మల్ని ప్రజలు క్షమించరు” అని పొంగులేటి తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us