తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ సెగ.. పుకార్లతో పానిక్ బయ్యింగ్.. అప్రమత్తమైన తెలంగాణ సర్కార్!

తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ కోసం కనిపిస్తున్న క్యూలైన్లు, "నో స్టాక్" బోర్డులు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొదలైన ఈ ఇంధన సెగ, ఇప్పుడు తెలంగాణ సరిహద్దు జిల్లాల మీదుగా రాష్ట్రవ్యాప్త చర్చకు దారితీసింది. అసలు ఈ పరిస్థితికి కారణం ఇంధన కొరత కాదు, కేవలం "పానిక్ బయ్యింగ్" (భయంతో కొనుగోలు చేయడం), ధరల వ్యత్యాసమేనని తాజా లెక్కలు చెబుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ సెగ.. పుకార్లతో పానిక్ బయ్యింగ్.. అప్రమత్తమైన తెలంగాణ సర్కార్!
Panic Buying Fueled

Edited By:

Updated on: Apr 28, 2026 | 9:28 AM

తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ కోసం కనిపిస్తున్న క్యూలైన్లు, “నో స్టాక్” బోర్డులు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొదలైన ఈ ఇంధన సెగ, ఇప్పుడు తెలంగాణ సరిహద్దు జిల్లాల మీదుగా రాష్ట్రవ్యాప్త చర్చకు దారితీసింది. అసలు ఈ పరిస్థితికి కారణం ఇంధన కొరత కాదు, కేవలం “పానిక్ బయ్యింగ్” (భయంతో కొనుగోలు చేయడం), ధరల వ్యత్యాసమేనని విశ్లేషణలు చెబుతున్నాయి.

పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతరం ఇంధన ధరలు భారీగా పెరుగుతాయనే ప్రచారం సోషల్ మీడియాలో జోరందుకుంది. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో కొన్ని బంకులు మూతపడటంతో, తెలంగాణలోని ఖమ్మం, కొత్తగూడెం, వికారాబాద్, జోగులాంబ గద్వాల్ వంటి జిల్లాల ప్రజలు ఒక్కసారిగా బంకులకు పోటెత్తారు. “రేపు ధర పెరుగుతుంది.. ఇప్పుడే ఫుల్ ట్యాంక్ చేయించుకుందాం” అనే ఆందోళనతో అవసరం లేకున్నా వాహనదారులు ఎగబడటంతో రిటైల్ అవుట్‌లెట్ల వద్ద కృత్రిమ కొరత ఏర్పడింది.

మరో ముఖ్య కారణం ఇంధన ధరల మధ్య ఉన్న భారీ వ్యత్యాసం.

రిటైల్ బంకుల్లో ధర: సుమారు రూ. 95 (లీటరుకు)

పారిశ్రామిక (I&C) ధర: సుమారు రూ. 150 (లీటరుకు)

ఈ రూ. 55 వ్యత్యాసం కారణంగా భారీ పరిశ్రమలు, రవాణా సంస్థలు తమ వాహనాలను రిటైల్ బంకుల వైపు మళ్లిస్తున్నాయి. దీనివల్ల సాధారణ వినియోగదారుల కోసం కేటాయించిన ఇంధనం త్వరగా నిండుకుంటోంది. దీనిని అరికట్టేందుకు I&C డీజిల్‌పై ఉన్న 27% వ్యాట్ (VAT)ను తాత్కాలికంగా తగ్గించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది.

పరిస్థితిని గమనించిన తెలంగాణ పౌర సరఫరాల శాఖ (TG CCS) అధికారులు రంగంలోకి దిగారు. ఇటీవల నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని రిటైల్ అవుట్‌లెట్లలో స్టాక్ కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. ముఖ్యంగా వరి సేకరణ, వ్యవసాయ పనులకు ఇంధన అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే సరిహద్దు జిల్లాల డీసీఎస్‌ఓలు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

Fuel Stock In Telangana

తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ నిల్వలకు ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కేవలం పుకార్లను నమ్మి పానిక్ బయ్యింగ్‌కు పాల్పడకుండా ఉంటే, పరిస్థితి త్వరలోనే సాధారణ స్థితికి చేరుకుంటుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us