Telangana: ప్రాణం తీసిన ఆర్థిక ఇబ్బందులు.. డబ్బులు ఇచ్చిన వారు తిరిగి ఇవ్వకపోవడంతో..

డబ్బు.. అంతులేని ఆనందానికి, చెప్పుకోలేనంత విషాదానికి కారణమవుతుంది. నవ్విస్తుంది.. ఏడిపిస్తుంది.. జీవితాలను నిలబెడుతుంది. కుటుంబాలను నిలువునా ముంచేస్తుంది. అందుకే డబ్బు విషయంలో..

Telangana: ప్రాణం తీసిన ఆర్థిక ఇబ్బందులు.. డబ్బులు ఇచ్చిన వారు తిరిగి ఇవ్వకపోవడంతో..
mothers dead body
Follow us

|

Updated on: Oct 14, 2022 | 7:08 AM

డబ్బు.. అంతులేని ఆనందానికి, చెప్పుకోలేనంత విషాదానికి కారణమవుతుంది. నవ్విస్తుంది.. ఏడిపిస్తుంది.. జీవితాలను నిలబెడుతుంది. కుటుంబాలను నిలువునా ముంచేస్తుంది. అందుకే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతుంటారు. ఇలా కొందరి వ్యక్తుల నుంచి డబ్బులు తీసుకున్న ఓ వ్యక్తి.. వాటిని ఇతరులకు ఇచ్చాడు. వారు డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో అప్పు ఇచ్చిన వారి నుంచి వేధింపులు మొదలయ్యాయి. అప్పు కట్టాల్సిందేనని తేల్చి చెప్పడంతో మనోవేదనకు గురయ్యాడు. దీంతో ఏమీ చేయలేని పరిస్థితిలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లాలోని వేంసూరు మండలం కందుకూరు గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు.. మధిర ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని కొందరు ఫైనాన్సర్లతో పాటు పలువురి వద్ద నుంచి ఆయన ఇతరులకు డబ్బు ఇప్పించారు. అప్పు తీసుకున్న వారు స్పందించకపోవడం, డబ్బులు ఇవ్వాలని అప్పు ఇచ్చిన వారి వేధింపులు తోడవడంతో వెంకటేశ్వరరావు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. వారి వేధింపులు తట్టుకోలేక కొంతకాలంగా వారికి వడ్డీ చెల్లించాడు.

పరిస్థితి మరింత ఇబ్బంది కరంగా మారడంతో వారికి అసలు, వడ్డీ చెల్లించే అవకాశం లేక మధిర నుంచి పెనుగంచిప్రోలుకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో కందుకూరుకు వచ్చిన వెంకటేశ్వరరావు పురుగుల మందు తాగి పడిపోయాడు. విషయం తెలుసుకున్న అతని భార్య స్వగ్రామానికి చేరుకున్నారు. వెంకటేశ్వరరావుకు చికిత్స అందించేందుకు సత్తుపల్లి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య.. కడుపు నొప్పి తాళలేక పురుగుల మందు తాగి చనిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

అదే సమయంలో వెంకటేశ్వరరావుకు సంబంధించిన సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. ఇందులో డబ్బులు తీసుకుని వేరే వాళ్లకు ఇచ్చానని, వారు కట్టకపోవడంతో అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగిందని వాపోయాడు. కొంతకాలంగా సొంతంగా డబ్బు కట్టినా, ఇక కట్టలేని పరిస్థితులు ఎదురయ్యాయని కన్నీటిపర్యంతమయ్యాడు. అనంతరం పురుగుల మందు తాగి చనిపోయాడు. సాయంత్రానికి ఈ వీడియో వైరల్‌గా మారగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే.. వెంకటేశ్వర్లు ఎవరి దగ్గరి నుంచి డబ్బు తీసుకున్నాడు.. ఎవరెవరికి ఇచ్చాడు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్