
కొమురం భీం జిల్లాలో షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగుచూసింది. ఓ వ్యక్తి లోభితనం ఊరు మొత్తాన్ని భయపడేలా చేసింది. చింతలమానేపల్లి మండలం కేంద్రంలో నివాసం ఉంటున్న జనాలు ఒక్కసారిగా ఆస్పత్రికి పరుగులు తీశారు. అందుకు కారణం పిచ్చి కుక్క కరిచిన గేదె పాలు తాగడం..పెరుగు తినడమే. అవును… గేదెపై ఓ పిచ్చి కుక్క దాడి చేసి.. గాయపరిచింది. ఈ విషయం తెలిస్తే తన వద్ద పాలు కొనరేమో అని గేదె యజమాని నాన్నయ్య ఆందోళన చెందాడు. అందుకే విషయాన్ని దాచి యధావిదిగా పాలు అమ్మాడు.
అయితే ఆ గేదె పాలు తాగిన దూడ మృతి చెందడంతో విషయం బయటకు పొక్కింది. దీంతో గత కొద్ది రోజులుగా గేదె పాలు తాగిన 300 మంది బాధితులు ఆందోళన చెందుతున్నారు. తమకు ఏమైనా అవుతుందేమో అన్న భయంతో ఆస్పత్రికి పరుగులు తీశారు. వారికి టెస్టులు నిర్వహించిన ఆస్పత్రి సిబ్బంది.. యాంటి రేబిస్ టీకాలు వేశారు. ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో.. గ్రామ పంచాయతీ కార్యాలయం లో అత్యవసర మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు అధికారులు. గ్రామం మొత్తాన్ని భయపెట్టిన నాన్నయ్యను అందరూ తిట్టి పోస్తున్నారు. నిజమే మరి.. అతడు జనం ప్రాణాలతో చెలగాటం ఆడాడు. మరి గ్రామస్థులు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తారో లేదో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..