Dharani portal: ధరణి కిరికిరి.. జనంలో జగడాలు.. లింక్ డాక్యుమెంట్‌తో తగాదాలు

రెవెన్యూ శాఖలో సమూల మార్పులు చేపట్టింది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ట్రాన్స్‌పరెన్సీ కోసం VRO వ్యవస్థనే రద్దు చేసి పారేసింది. ఇంత వరకు బాగానే ఉంది... కానీ ఆ వ్యవస్థ చేసిన తప్పులు..

Dharani portal: ధరణి కిరికిరి.. జనంలో జగడాలు.. లింక్ డాక్యుమెంట్‌తో తగాదాలు

Updated on: Mar 31, 2021 | 2:06 PM

Dharani Portal Linked Document: రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో విప్లవవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌ను సమస్యలు వెంటాడుతున్నాయి. కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇటు అమ్మేవాళ్లు… అటు కొనేవాళ్లు… ఇద్దరూ టెన్షన్ పడుతున్నారు. పెరిగిపోతున్న పెండింగ్ రిజిస్ట్రేషన్లు అఫిషియల్స్‌కు షాక్‌ ఇస్తోంది.

ధరణితో సరికొత్త శకానికి నాంది పలికిన తెలంగాణ ప్రభుత్వం.. రెవెన్యూ శాఖలో సమూల మార్పులు చేపట్టింది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ట్రాన్స్‌పరెన్సీ కోసం VRO వ్యవస్థనే రద్దు చేసి పారేసింది. ఇంత వరకు బాగానే ఉంది… కానీ ఆ వ్యవస్థ చేసిన తప్పులు ఇప్పుడు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.

లింక్ డాక్యుమెంట్‌తో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రజలు…

A వద్ద B భూమి కొని Cకి అమ్మాడు అనుకుందాం… C వద్ద D అనే వ్యక్తి కొని ధరణిలో రిజిస్ట్రేషన్‌కు వెళ్తే… అక్కడ యజమానిగా A పేరునే చూపిస్తోంది. అంటే ఒకసారి తన భూమిని అమ్మేసిన A మరోసారి అమ్ముకునే ఛాన్స్ ఉంది. దీంతో తగాదాలు వస్తున్నాయి.

ఒక సర్వే నెంబర్‌లో కొంత భూమి వివాదాస్పదంగానో… ప్రభుత్వ, దేవాదాయ, అటవీ భూమిగానో ఉంటే మొత్తం సర్వే నెంబర్‌ను బ్లాక్ చేయడం అతి పెద్ద సమస్య. ఆ సర్వే నెంబర్‌లో మిగతా రైతులు… తమ సొంత భూమిని అమ్ముకోలేక… కొనుక్కోలేక ఇబ్బంది పడుతున్నారు. వ్యక్తుల పేరుతో కాకుండా సంస్థల పేరుతో ఉండే భూములను అమ్మడం కొనడం ప్రస్తుతానికి అవకాశం లేదు.

ఎవరైనా ఇద్దరు భాగస్వాములు కలిపి కొనుక్కున్న భూమిని అమ్ముకోలేని పరిస్థితి. జాయింట్ రిజిస్ట్రేషన్‌కు ధరణి పోర్టల్‌లో కాలమ్‌ అస్సలు లేదు. ఉమ్మడిగా వ్యక్తులే కాదు… సంస్థలు కూడా భూములు కొనుక్కునే పరిస్థితి ప్రస్తుతం ధరణి పోర్టల్‌లో కనిపించడం లేదు.

ఒకవేళ యజమాని చనిపోతే… అతని భూమిని కుటుంబ సభ్యులంతా కలిసి ఉమ్మడిగా అమ్మే ఛాన్స్ ఉండేది. ఇప్పుడు చట్టబద్దమైన హక్కుదారుడు మాత్రమే అమ్మేలా మార్పులు చేశాడు. ఆ చట్టబద్దత పొందేందుకు వారసులు ఇబ్బంది పడుతున్నారు.

ఇవి కూడా చదవండి : ఏప్రిల్ 1 నుంచి ఈ 5 పనులను ప్రారంభించండి… కష్ట సమయాల్లో కూడా డబ్బు కొరత ఉండదు..

ఇవి కూడా చదవండి : Petrol Diesel Rates: వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి..!