బాసర ట్రిపుల్‌ఐటీలో(Basara IIIT) విద్యార్థుల నిరసన కొనసాగుతోంది. నిన్న రాత్రి నుంచి ఆహారం తీసుకోకుండా స్టూడెంట్స్ ఆందోళన చేపట్టారు. దాంతో ఇంచార్జ్ వీసీ విద్యార్థులను చర్చలకు పిలిచి గైర్హాజరయ్యారు. ఎంత సేపూ ఎదురుచూసినా.. వీసీ రాకపోకవడంతో విద్యార్థులంతా అక్కడే బైఠాయించారు. తమ సహనాన్ని అధికారులు ఇంకా పరీక్షిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఎల్బీనగర్‌లో పేరెంట్స్ కమిటీ భేటీ అయ్యింది. ట్రిపుల్‌ఐటీలో విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో పేరెంట్స్ కమిటీ కార్యాచరణ ప్రకటించారు. చలో బాసరకు పిలుపునిచ్చారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు.. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు బాసర పర్యటన నేపథ్యంలో నిర్మల్, భైంసా, ముథోల్ బీజేపీ నేతలను ముందస్తు అరెస్ట్‌లు చేస్తున్నారు పోలీసులు. అనుమతి లేనిదే ట్రిపుల్ ఐటీలోకి ఎవ్వరినీ రానివ్వడం లేదు. ఎంపీ సోయం పర్యటన, విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో బాసర ట్రిపుల్ ఐటీ వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.ట్రిపుల్ ఐటీ సెక్యూరిటీ వింగ్‌తో విద్యార్థులు హాస్టల్ వీడి బయటకు రాకుండా భద్రత కట్టుదిట్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..