అర్థరాత్రి ఓయూలో విద్యార్థినుల ఆందోళన
ఉస్మానియా యూనివర్శిటీలో అర్థరాత్రి హాస్టల్స్ విద్యార్థులు ధర్నాకు దిగారు. హాస్టల్లో సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆందోళన వ్యక్తం చేశారు. తినే తిండిలో పురుగులు వస్తున్నాయని మండిపడ్డారు. హాస్టల్ పరిసరాల్లో పాములు, ఎలుకలు, పిల్లులు తిరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్లో తమకు రక్షణ లేకుండా పోయిందని విద్యార్థినులు వాపోయారు. హాస్టల్ వార్డెన్ గానీ, ప్రిన్సిపాల్ గానీ, ఇతర అధికారులెవ్వరికీ తమ గోడు విన్నవించినా పట్టించుకోలేదని వాపోయారు. తమ సమస్యలు పరిష్కరించేవరకూ ఆందోళన కొనసాగిస్తామన్నారు. అర్థరాత్రి విద్యార్థినులు […]
ఉస్మానియా యూనివర్శిటీలో అర్థరాత్రి హాస్టల్స్ విద్యార్థులు ధర్నాకు దిగారు. హాస్టల్లో సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆందోళన వ్యక్తం చేశారు. తినే తిండిలో పురుగులు వస్తున్నాయని మండిపడ్డారు. హాస్టల్ పరిసరాల్లో పాములు, ఎలుకలు, పిల్లులు తిరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
హాస్టల్లో తమకు రక్షణ లేకుండా పోయిందని విద్యార్థినులు వాపోయారు. హాస్టల్ వార్డెన్ గానీ, ప్రిన్సిపాల్ గానీ, ఇతర అధికారులెవ్వరికీ తమ గోడు విన్నవించినా పట్టించుకోలేదని వాపోయారు. తమ సమస్యలు పరిష్కరించేవరకూ ఆందోళన కొనసాగిస్తామన్నారు. అర్థరాత్రి విద్యార్థినులు రోడ్డెక్కడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సర్థిచెప్పగా విద్యార్థినులు ధర్నా విరమించారు.