OU Protest: చికెన్ కర్రీలో పురుగు.. రోడ్డుకెక్కిన విద్యార్థినులు..చివరికి

చికెన్ కర్రీలో పురుగు వచ్చిందంటూ ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. ఆదివారం మధ్యాహ్నం లంచ్ టైమ్ లో లేడీస్ హాస్టల్ మెస్ లో ఓ విద్యార్థినికి...

OU Protest: చికెన్ కర్రీలో పురుగు.. రోడ్డుకెక్కిన విద్యార్థినులు..చివరికి
Student Protest

Updated on: Mar 28, 2022 | 2:00 PM

చికెన్ కర్రీలో పురుగు వచ్చిందంటూ ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. ఆదివారం మధ్యాహ్నం లంచ్ టైమ్ లో లేడీస్ హాస్టల్ మెస్ లో ఓ విద్యార్థినికి చికెన్ కర్రీలో (Chicken Curry) పురుగు వచ్చిందని అక్కడున్న సిబ్బందిని ప్రశ్నించారు. వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో విద్యార్థినులందరూ కలిసి వసతిగృహం రోడ్డుకెక్కారు. మహిళా వసతి గృహంలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉన్నత చదువుల కోసం తాము ఓయూకు వస్తే ఇక్కడ టాయిలెట్లు (Toilets) కూడా సరిగా లేవని, మంచి నీటి సౌకర్యం లేదని, నాణ్యమైన ఆహారం కూడా అందించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాలు కల్పించకపోతే ఎలా చదువుకుంటామని ప్రశ్నించారు. నాణ్యమైన ఆహారం అందించాలని, నీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

ఆదివారం సాయంత్రం 3.30 గంటలకు ప్రారంభమైన ఈ ఆందోళన రాత్రి 8.30 వరకు కొనసాగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థినులకు నచ్చజెప్పారు. అనంతరం ఆందోళన విరమించారు.

Also Read

Anand Mahindra: అద్భుతమైన సక్సెస్ ఫార్ములా చెప్పిన ఆనంద్ మహీంద్రా.. ఇది అందరకీ ఉపయోగకరమైనదే..

CM KCR: యాదాద్రిలో మహకుంభ సంప్రోక్షణ.. తొలి భక్తునిగా సీఎం కేసీఆర్.. లైవ్ వీడియో

Kidney Healthy Foods: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి పదార్థాలు తినాలి.. ఏమి తినకూడదో తెలుసా..