పాతిపెట్టిన శవం.. అర్ధరాత్రి సమాధి నుంచి మాయం.. అసలు సంగతి ఇదే!

మనుషుల్లో మానవత్వం మంట గలుస్తోంది. జాలి, దయ, కరుణ లాంటి గుణాలేవీ మచ్చుకైన లేకుండా ప్రవర్తిస్తున్నారు. చివరికి చనిపోయిన వారిపై..

పాతిపెట్టిన శవం.. అర్ధరాత్రి సమాధి నుంచి మాయం.. అసలు సంగతి ఇదే!
Dead Corpse

Updated on: Jul 31, 2021 | 8:37 PM

మనుషుల్లో మానవత్వం మంట గలుస్తోంది. జాలి, దయ, కరుణ లాంటి గుణాలేవీ మచ్చుకైన లేకుండా ప్రవర్తిస్తున్నారు. చివరికి చనిపోయిన వారిపై కూడా కనికరం చూపించడం లేదు. ఆరడుగుల జాగ కోసం పాతిపెట్టిన మృతదేహాన్ని అర్ధరాత్రి అమానుషంగా తీసి బయటపడేశారు గుర్తు తెలియని వ్యక్తులు…నల్లగొండ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.

జిల్లాలోని కేతేపల్లి మండలం కొండకిందిగూడెం గ్రామానికి చెందిన బుచ్చమ్మ వృద్దురాలు చనిపోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు గ్రామంలోని ఖాళీ ప్రదేశంలో ఖననం చేశారు. అయితే రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు సమాధిలోంచి పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసి బయటపడేశారు. శవ పేటికను గ్రామంలోని నడిరోడ్డుపై వదిలేశారు. ఘటనకు బాధ్యులైన వారిని శిక్షించి, తమకు న్యాయం చేయాలని మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు.

Loading...
Unable to load recommendations.
Follow Us