Telangana: అయ్యో భగవంతుడా ఏంటయ్యా ఈ ఘోరం.. పెళ్లయిన రెండో రోజే.. కరెంట్ షాక్‌తో

విద్యుదాఘాతంతో నవ వరుడు మృతి చెందిన ఘటన మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం కోడిపుంజుల తండాలో వెలుగుచూసింది. ఈ నెల 18న కృష్ణా జిల్లా కంకిపాడులో వీరి పెళ్లి జరిగింది. అనంతరం వధూవరులు కోడిపుంజుల తండాకు రాగా, ప్రమాదవశత్తూ నవ వరుడు ఇస్లావత్‌ నరేశ్‌ కరెంట్ షాక్‌తో మృతి చెందాడు.

Telangana: అయ్యో భగవంతుడా ఏంటయ్యా ఈ ఘోరం.. పెళ్లయిన రెండో రోజే.. కరెంట్ షాక్‌తో
Newlywed Youth Dies

Edited By:

Updated on: May 20, 2025 | 3:35 PM

కొడుకుకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసి మురిసిపోయారు ఆ తల్లిదండ్రులు. కానీ విధికి ఆ కొత్త జంటను చూసి కన్ను కుట్టిందో ఏమో నవ వరుడ్ని కరెంట్ షాక్ రూపంలో కాటేసింది. భర్త మరణంతో మరణంతో మానసిక ఆవేదనకు గురై.. ఒక్కసారిగా కుప్పకూలిపోయిన వధువు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మహబూబాబాద్ జిల్లాలో పెళ్లింట్లో విషాదం చోటుచేసుకుంది. పెళ్లయిన రెండో రోజే విద్యుత్ షాక్‌తో నవవరుడు మృతిచెందాడు.  బయ్యారం మండలం గౌరారం శివారు కోడిపుంజుల తండాలో ఈ విషాదం చోటుచేసుకుంది.

ఇంట్లో నల్లా మోటార్ కోసం.. స్విచ్‌బోర్డ్‌లోని ప్లగ్‌లోకి వదులుగా ఉన్న విద్యుత్ వైర్లను చొప్పించడానికి ప్రయత్నిస్తుండగా నరేష్ విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మరణించాడు. భర్త కళ్ల ముందే మృతి చెందడంతో.. భార్య మానసికంగా డిస్ట్రబ్ అయి సృహ తప్పిపడిపోయింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు.  ఈ నెల 18వ తేదీ ఆదివారం రోజున ఇస్లావత్ నరేష్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామానికి చెందిన యువతితో వివాహం జరిగింది. వేడకకు హాజరయిన బంధుమిత్రుల వారు కలకాలం చల్లగా ఉండాలని ధీవించారు. సోమవారం ఉదయం నవదంపతులు వరుడి ఇంటికి చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం వరుడి ఇంటి వద్ద రిసెప్షన్‌కు ఏర్పాట్లు జరుగుతునాయి.. ఇంతలోనే ఊహించని విషయం అలముకుంది.. వేదిక పైన కూర్చోవలసిన వరుడ్ని మృత్యువు కాటేసింది.

ఆ ఇంటి ముందు వేసిన షామియానాలు తీయనే లేదు. ఇళ్లకు కట్టిన పచ్చని తోరణాలు వడబడనే లేదు. ఇంతలోనే చావు ముంచుకొచ్చింది. కుటుంబ సభ్యుల రోదన చూసి స్థానికులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి