Telangana: పెళ్లైన తర్వాత అతడు తనకు అన్న అవుతాడని తెలుసుకుంది.. ఆపై ఊహించని విధంగా..

|

Sep 22, 2021 | 3:08 PM

తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో విషాదం చోటుచేసుకుంది. కొన్ని రోజుల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్న ఓ జంట.. ఆత్మహత్యకు యత్నించారు.

Telangana: పెళ్లైన తర్వాత అతడు తనకు అన్న అవుతాడని తెలుసుకుంది.. ఆపై ఊహించని విధంగా..
Newly Married women commits suicide
Follow us on

తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో విషాదం చోటుచేసుకుంది. కొన్ని రోజుల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్న ఓ జంట.. ఆత్మహత్యకు యత్నించారు. యువతి మృతి చెందగా.. యువకుడు ఆస్పత్రిలో చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. నెహ్రూ నగర్​ తండాకు చెందిన బొడ శ్వేత(21), కట్టుగూడెం గ్రామానికి చెందిన గుగులోత్ వెంకటేశ్​(24) పది రోజుల క్రితం పెద్దలకు తెలియకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం యువకుడి పూర్తి వివరాలు తెలుసుకున్న యువతి.. తనకు సోదరుడి వరుస అవుతాడని.. మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వెంకటేశ్​ కూడా పురుగుల మందు తాగి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. స్థానికులు ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. తమ బిడ్డను మోసం చేసి పెళ్లి చేసుకుని సూసైడ్ చేసుకునేలా చేశాడని.. యువతి తరఫు బంధువులు యువకుడి ఇంటిపై దాడికి యత్నించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. యువతి తరఫు బంధువులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

వేధింపులు తాళలేక భర్త మర్మాంగాన్ని కోసిన భార్య

మహబూబాబాద్​ జిల్లా మరిపెడ మండలం తానంచర్ల శివారు వాంకుతోడు తండాలో దారుణం జరిగింది. మద్యానికి బానిసైన భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ… భర్త మర్మాంగంపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన అతడు స్పాట్‌లోనే మృతి చెందాడు. వాంకుతోడు తండాకు చెందిన భూక్యా బిచ్యా(50), ప్రమీల దంపతులు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. మద్యానికి బానిసైన బిచ్యా.. రోజు తాగొచ్చి భార్యతో వాదులాటకు దిగేవాడు. మంగళవారం రాత్రి కూడా లిక్కర్ సేవించి వచ్చిన బిచ్యా.. భార్యతో గొడవపడ్డాడు. మాటా మాటా పెరిగి.. ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ప్రమీల.. భర్త మర్మాంగంపై దాడిచేయడంతో అతడు ఘటనాస్థలిలోనే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేకుకుని.. దర్యాప్తు జరుపుతున్నారు.

Also Read: విశాఖ ఏజెన్సీలో పట్టుబడ్డ కోటి రూపాయల విలువైన గంజాయి

బాలికపై అత్యాచారం.. కన్నతల్లే ముందుండి మరీ.. విచారణలో వెలుగులోకి షాకింగ్ విషయాలు..