వింత వైరస్‌తో 30 వేల కోళ్లు మృతి.. డేంజరే!

| Edited By:

Feb 24, 2020 | 6:45 AM

ఇప్పటికే కరోనా వైరస్‌తో ప్రపంచమంతా గడగడలాడిపోతుంది. దీంతో.. ఇండియా వ్యాప్తంగా ప్రజలు చికెన్ తినడం మానేశారు. దీంతో చికెన్ బిజినెస్ బాగా పడిపోయింది. అయితే చికెన్ వ్యాపారంపై మరో కొత్త వైరస్ ఎటాక్ చేసింది. ఈ వింత వైరస్‌తో ఏకంగా 30 వేల కోళ్లు మృతి..

వింత వైరస్‌తో 30 వేల కోళ్లు మృతి.. డేంజరే!
Follow us on

Crime News: ఇప్పటికే కరోనా వైరస్‌తో ప్రపంచమంతా గడగడలాడిపోతుంది. దీంతో.. ఇండియా వ్యాప్తంగా ప్రజలు చికెన్ తినడం మానేశారు. దీంతో చికెన్ బిజినెస్ బాగా పడిపోయింది. అయితే చికెన్ వ్యాపారంపై మరో కొత్త వైరస్ ఎటాక్ చేసింది. ఈ వింత వైరస్‌తో ఏకంగా 30 వేల కోళ్లు మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బయ్యన గూడెంలో చోటుచేసుకుంది. దీంతో పౌల్ట్రీ రంగ రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకీ కోళ్ల మృతి సంఖ్య పెరుగుతుందే కానీ.. ఆ వైరస్ ఏంటనేది అర్థకావడం లేదని యజమానులు తలలు బాదుకుంటున్నారు. ఎన్నో లక్షలు ఖర్చుపెట్టి ఈ కోళ్ల పారాలను నడిపిస్తుంటే.. నష్టం మాత్రమే మిగులుతుందని ఆవేదన చెందుతున్నారు.

ఈ ఘటనపై తహశీల్దార్ రవికూర్ స్పందించారు. ఈ మధ్య కోళ్లకి వింత వైరస్ సోకిందని, డాక్టర్లు టెస్ట్ చేసినా ఆ వైరస్ ఏంటనేది కనిపెట్టలేకపోతున్నారన్నారు. తాజాగా.. ఓ 30 వేల కోళ్లు చనిపోయన్నారు. అయితే ఇలా చనిపోయిన కోళ్లని అగ్రహారం గ్రామం దగ్గర్లని చెరువులో గోతులు తీసి వేస్తున్నారు. వాటిపై మట్టిని పూడ్చకపోవటంతో.. కుక్కలు పీక్కుతింటున్నాయి. ఫలితంగా దుర్వాసన వస్తోందని నాయకుల గూడెం ప్రజలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ మధ్యే చైనాలో కూడా వైరస్ సోకి కోళ్లు మృతి చెందాయి. అలాగే ఇక్కడ కూడా జరుగుతుందోమోనని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు.