Hydearabad: నాంపల్లి రైల్వే స్టేషన్‌లో అగ్ని ప్రమాదం.. బయల్దేరేందుకు సిద్ధమైన ట్రైన్‌లో మంటలు!

హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వేస్టేషన్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్టేషన్‌లో ఆగి ఉన్న హైదరాబాద్ - జైపూర్ స్పెషల్ ట్రైన్ బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు కొద్దిసేపట్లో ఇతర భోగీలకు వ్యాపించాయి. గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు.

Hydearabad: నాంపల్లి రైల్వే స్టేషన్‌లో అగ్ని ప్రమాదం.. బయల్దేరేందుకు సిద్ధమైన ట్రైన్‌లో మంటలు!
Nampally Train Fire

Updated on: May 15, 2026 | 10:03 PM

హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వే స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 7 గంటల 50 నిమిషాలకు బయల్దేరాల్సిన హైదరాబాద్ – జైపూర్ స్పెషల్ ట్రైన్ బోగీల్లో సరిగ్గా ఆరున్నరకు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏసీ కోచ్ B2 బోగిలో చెలరేగిన మంటలు క్షణాల్లో ఇతర బోగీలకు వ్యాపించాయి. అది గమనించిన ప్రయాణికులు భయంతో ట్రైన్‌లోంచి దిగి స్టేషన్‌ బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ట్రైన్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లి ప్రయత్నం చేయగా అప్పటికే ట్రైన్లో మంటలను చూసి ఫైర్ డిస్టింగ్విష్ పరికరాలతో భోగి విండో అద్దాలను పగొట్టాడు ఓ ప్రయాణికుడు.

అనంతరం అక్కడే ఉన్న వాటర్ పైపుల ద్వారా మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేశారు ఇద్దరు ప్రయాణికులు. ఈ లోపు సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. అయితే ప్రమాద సమయంలో రైల్వే భోగీల్లో పెద్దగా జనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక ఘటనపై స్పందించిన రైల్వే సిబ్బంది ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. షార్ట్‌ సర్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు అధికారులు. శనివారం FSL టీమ్ వచ్చాక అసలు విషయాలు బయటకొచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us