Akbaruddin Owaisi Hate Speech Case:అక్బరుద్దీన్ ఒవైసీకి ఊరట లభించింది. అక్బర్ హేట్ స్పీచ్‌పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. హేట్ స్పీచ్ కేసులు కొట్టివేస్తూ నాంపల్లి కోర్ట్ తీర్పునిచ్చింది. అక్బరుద్దీన్ పై నమోదైన రెండు కేసులు కొట్టివేస్తున్న న్యాయమూర్తి ప్రకటించారు. భవిష్యత్తు లో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదని వార్నింగ్ ఇచ్చారు. అటువంటి ప్రసంగాలు దేశ సమగ్రతకు మంచిది కాదని హితవు పలికారు. ఇదేదో విజయమని భావించవచ్చదని.. విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తే చర్చలు తీసుకుంటామని నాంపల్లి కోర్ట్ న్యాయమూర్తి హెచ్చరించారు. అక్బరుద్దీన్ హేట్ స్పీచ్‌పై ఎఫ్‌ఐఆర్‌లో దేశ ద్రోహం కింద పలు సెక్షన్ల కేసులు నమోదయ్యాయి. అయితే కోర్టుకి సమర్పించిన ఛార్జ్‌షీట్‌లో మాత్రం ఆ సెక్షన్లను తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
నిర్మల్‌లో దాదాపు పదేళ్ల కిందట అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ ప్రసంగంపై ఐపీసీ 120 B, 153 A, 295, 298, 188 సెక్షన్ల కింద పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. కేసులో అరెస్టయిన అక్బరుద్దీన్.. 40 రోజులు జైల్లో శిక్ష అనుభవించారు. అటు ఆదిలాబాద్‌లో హిందూ దేవతలపై అక్బరుద్దీన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు కేసులకు సంబంధించి నాంపల్లి కోర్టు సుదీర్ఘ కాలం పాటు విచారణ జరిపిన ఇవాళ తీర్పు ఇచ్చింది. ఈ కేసులో 30 మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది. ఈ కేసులో గతంలో అరెస్టైన అక్బరుద్దీన్ 40 రోజుల పాటు జైల్లో ఉన్నారు. అయితే, దీనిపైనే అనుమానం వ్యక్తం చేస్తోంది బీజేపీ. సాక్ష్యాధారాలు సేకరించడంలో పోలీసులు విఫలం అయ్యారని ఆరోపించారు ఆ పార్టీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు.
ఇదిలావుంటే, అక్బరుద్దీన్ తీర్పుతో పాతబస్తీలో పోలీసుల అలెర్ట్ అయ్యారు. కోర్ట్ ఆదేశాలను అనుగుణంగా సంబరాలకు అనుమతి లేదంటూ పోలీసులు తెలిపారు. నిరసన ర్యాలీలకు కూడా అనుమతి లేదన్నారు. నిబంధనలు ఉల్లఘింస్తే కేసులు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. కాగా, పాతబస్తీలో ఎప్పటికప్పుడు పరిస్థితిని పోలీస్ ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.
Read Also… Andhra Pradesh: జనసేనానిపై జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రశంసలు.. తమ ప్రాంతానికి కూడా రావాలని ఆహ్వానం