Rare Disease: గంట వ్యవధిలో 4 వేల కోళ్లు మృతి.. ఆందోళనలో స్థానికులు.. అసలు కారణం ఇదే.!

Mystery Disease In Telangana: పెద్దపల్లి జిల్లాలో కలకలం రేగింది. కాల్వ శ్రీరాంపూర్‌ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టుండి...సుమారు 4వేల నాటుకోళ్లు..

Rare Disease: గంట వ్యవధిలో 4 వేల కోళ్లు మృతి.. ఆందోళనలో స్థానికులు.. అసలు కారణం ఇదే.!
Follow us

|

Updated on: Mar 03, 2021 | 6:13 PM

Mystery Disease In Telangana: పెద్దపల్లి జిల్లాలో కలకలం రేగింది. కాల్వ శ్రీరాంపూర్‌ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టుండి…సుమారు 4వేల నాటుకోళ్లు మరణించిన ఘటన స్థానికంగా భయందోళనకు గురి చేసింది. గంటల వ్యవధిలోనే భారీగా కోళ్లు మృత్యువాతపడ్డాయి. ఉదయం దాణా తిన్న తర్వాత కొన్ని గంటల్లోనే కోళ్లన్నీ మరణించడంతో యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..

కాల్వ శ్రీరాంపూర్‌కు చెందిన స్వామి అనే రైతు తనకున్న వ్యవసాయ భూమిలో నాలుగు వేల కోళ్లను పెంచుతున్నాడు. ఉదయం పూట కోళ్లకు దాన వేసిన తర్వాత వాటిని ఫామ్‌లో వదిలిపెట్టాడు. రెండు గంటల తరువాత ఒకదాని తర్వాత ఒకటి నాలుగు వేల కోళ్లు మృతి చెందాయి. దీంతో తనకు దాదాపు 20 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు చెప్పాడు. కాగా, కోళ్ల మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. బర్డ్‌ ఫ్లూ కారణంగా మృత్యువాతపడ్డాయని స్థానికులు భయపడ్డారు. చివరికి రాణికెట్ అనే వ్యాధితో కోళ్లు చనిపోయినట్లు తేల్చారు. ఈ వ్యాధి సోకిన కోళ్లకు.. మొదటిగా రెక్కలు నేల వాలటం.. ఆ తర్వాత కాళ్లు, మెడ చచ్చుబడి దాదాపు పక్షవాతంలా రావడం.. చివరికి చనిపోతాయని తెలుస్తోంది. ఈ వ్యాధి ఒక్క కోడికి వస్తే.. చుట్టూ ఉన్న అన్ని కోళ్లకూ వ్యాపిస్తుందట. అయితే ఈ వ్యాధితో మనుషులకు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పారు.

మరిన్ని ఇక్కడ చదవండి:

గురకపెట్టి నిద్రపోయిన కాపలా కుక్క.. గన్ పెట్టి షాపును దోచుకున్న దొంగ.. మధ్యలో అదిరిపోయే ట్విస్ట్..!

లోదుస్తులను మాస్క్‌గా ధరించిన మహిళ.. వీడియో వైరల్.. నెట్టింట నవ్వులు పువ్వులు..

పవన్ కళ్యాణ్‌కు నాలుగో భార్యగా ఉంటాను.. నెటిజన్ ప్రశ్నకు ఆషూ ఆన్సర్.. వైరల్ ట్వీట్.!

Bigg Boss Season 5: బిగ్ బాస్ సీజన్ 5.. రేసులో ఉన్న కంటెస్టెంట్లు వీరే.. వివరాలు ఇవే..!