తెలంగాణ బీజేపీలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు హీట్ పుట్టిస్తున్నాడు. అయితే అక్కడ నగేష్‌కు టికెట్ ఇచ్చింది అధిష్టానం. దీంతో సోయం అలకబూనారు. రెబల్‌గా బరిలో ఉంటానంటూ ప్రకటించారు. వలస వచ్చిన నేతకు టికెట్ ఇచ్చి సిట్టింగ్ ఎంపీగా తనను అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యాడర్ ఉన్న లీడర్ కావాలో.. క్యాడర్ లేని వలస లీడర్ కావాలో తేల్చుకోవాలంటూ సవాల్ విసురుతున్నారు. ఆదివాసీ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకున్నానంటున్నారు సోయం బాపూరావు. జిల్లాలో పార్టీని తానే బలోపేతం చేశానన్నది సోయం వాదన.
అసెంబ్లీ ఎన్నికల గెలుపు జోష్ తో పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది తెలంగాణ బీజేపీ. ఈ ఎన్నికల్లో కనీసం సగానికిపైగా సీట్లు దక్కించుకోవాలని గట్టిగా కసరత్తులు చేస్తోంది. ఈ నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ బీజేపీ నేతలను అలర్ట్ చేస్తోంది. బలమైన నేతలకు టికెట్లు ఇస్తూ.. గెలుపు అవకాశాలు ఖరారైన చోట సిట్టింగ్స్ అకాశాలు కల్పిస్తూ, పార్టీలో చేరిన మరికొందరికి అవకాశాలు కల్పిస్తోంది.