తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు..హెచ్చరించిన వాతావరణ శాఖ

|

Jun 12, 2020 | 4:06 PM

నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించాయి. ఈ ప్రభావంతో రాష్ట్రమంతటా కారుమబ్బులు కమ్ముకున్నాయి. మూడు రోజులపాటు చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని....

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు..హెచ్చరించిన వాతావరణ శాఖ
Follow us on

నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించాయి. ఈ ప్రభావంతో రాష్ట్రమంతటా కారుమబ్బులు కమ్ముకున్నాయి. మూడు రోజులపాటు చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్నం తెలిపారు. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయం కన్నా వేగంగా విస్తరించాయని… జయశంకర్ భూపాలపల్లి , వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్ , పెద్దపల్లి, జగిత్యాల , కరీంనగర్ , కొమరంభీం , ఆదిలాబాద్, నిర్మల్‌ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అన్నారు.ఇప్పటికే చత్తీస్‌గడ్ , బెంగాల్ ,అస్సాం ,అరుణాచల్ ప్రదేశ్ లలో నైరుతి విస్తరించిందని తెలిపారు. కోస్తాంధ్ర, రాయలసీమలో సాధారణం కంటే అధిక వర్షాలు పడతాయని, రెండు రోజులపాటు తీరప్రాంతం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.