TRS vs BJP: బీజేపీకి అంత సీన్ లేదు.. బండి సంజయ్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే..

TRS vs BJP: టీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌కు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి..

TRS vs BJP: బీజేపీకి అంత సీన్ లేదు.. బండి సంజయ్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే..

Updated on: Jan 01, 2021 | 2:20 PM

TRS vs BJP: టీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌కు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే గువ్వల ఘాటుగా స్పందించారు. బీజేపీకి అంత సీన్ లేదన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరం నిబద్ధత కలిగి ఉన్నామని పేర్కొన్నారు. కొన్ని సీట్లు గెలిచినంత మాత్రాన బీజేపీతో ఒరిగేదేమీ లేదని వ్యాఖ్యానించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని అన్న గువ్వల.. జీహెచ్ఎంసీ పరిధిలో బీజేపీ కార్పొరేటర్లే తమతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. తమను రెచ్చగొడితే ఏం జరుగుతుందో చూస్తారని బండి సంజయ్‌కు గువ్వల వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం అనేది పగటి కల అని వ్యాఖ్యానించారు.

 

Also read:

New Year’s Gift to Bunny: బ‌న్నీకి న్యూ ఇయర్ గిఫ్ట్‌ పంపించిన స్టార్ కమెడియన్.. ఆ గిఫ్ట్ ఏంటో తెలుసా?

Tunwal TZ Bike: మార్కెట్‌లోకి సరికొత్త బైక్‌ను విడుదల చేసిన తున్వాల్ కంపెనీ.. పెట్రోల్ బైక్‌లను తలపించేలా..