
రేపు వరంగల్‌లో మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్‌లు పర్యటిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంగళవారం రేపు ఉదయం 9.30 గంటల నిమిషాలకు వరంగల్‌కి వెళ్లబోతున్నారు కేటీఆర్. అన్ని ముంపు కాలనీలను సందర్శించి, వరదల వల్ల కలిగిన నష్టాన్ని పరిశీలిస్తున్నారు. ముంపుకు గల కారణాలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై కేటీఆర్ సమీక్షిస్తారు. ఇందులో మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీప్ విప్ వినయ్ భాస్కర్‌లు పాల్గొననున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజుల నుంచి ఎడతెరపు లేకుండా భారీ వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు వివిధ జిల్లాల్లో పర్యటించనున్నారు.
Also Read:
మళ్లీ పెరుగుతోన్న పెట్రోల్ ధరలు
బ్రేకింగ్ః ముంబైలోని క్రాఫోర్డ్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం