Talasani Srinivas Yadav: పెద్దమనసుతో ఈసారికి మినహాయింపు ఇవ్వాలి.. మంత్రి తలసాని విజ్ఞప్తి

|

Sep 12, 2021 | 9:33 PM

గణేష్ నిమజ్జనంపై హైకోర్టు ఆదేశాలను ఇప్పటికిప్పుడు అమలు చేయడం చేయడం అసాధ్యమన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. పెద్దమనసుతో ఈసారికి మినహాయింపు ఇవ్వాలని

Talasani Srinivas Yadav: పెద్దమనసుతో ఈసారికి మినహాయింపు ఇవ్వాలి.. మంత్రి తలసాని విజ్ఞప్తి
Talasani Srinivas Yadav And Satyavathi Rathod
Follow us on

Ganesh Immersion: గణేష్ నిమజ్జనంపై హైకోర్టు ఆదేశాలను ఇప్పటికిప్పుడు అమలు చేయడం చేయడం అసాధ్యమన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. పెద్దమనసుతో ఈసారికి మినహాయింపు ఇవ్వాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. 6 నెలల ముందుగా కోర్టు నిర్ణయం చెప్తే బాగుండేదని తలసాని అభిప్రాయపడ్డారు. నిమజ్జనం పూర్తయిన 48 గంటల్లోకి హుస్సేన్‌ సాగర్‌‌ను క్లీన్ చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన చెప్పారు. ఇప్పటికిప్పుడు బేబీ పాండ్స్ ఏర్పాటు చేయడం కష్టమన్నారు. పీఓపీ విగ్రహాలు తయారీ చేసుకుంటూ ఎంతో మంది బతుకున్నారని చెప్పారు. ఈ ఏడాది యధావిధిగా నిమజ్జనం జరిగేలా చూడాలన్నారు తలసాని. కోర్టులో రివ్యూ పిటిషన్‌లో సానుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నామని అన్నారు.

హుస్సేన్ సాగర్‌‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ రోజు (ఆదివారం) ఉదయం ఎమ్మెల్యే దానం నాగేందర్‌‌తో కలిసి ఖైరతాబాద్ గణపతికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ.. హుస్సేన్‌ సాగర్‌‌లో గణేష్‌ నిమజ్జనాలపై ఆంక్షలు విధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో భక్తులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్లాస్టర్‌‌ ఆఫ్​ పారిస్‌తో చేసిన విగ్రహాలను ట్యాంక్‌ బండ్‌లో నిమజ్జనం చేయొద్దంటూ కోర్టు తీర్పు ఇచ్చే సమయానికే గణేష్‌ విగ్రహాలు మండపాల్లోకి చేరాయని చెప్పారు.

ఇక, బీజేపీ నేతల హాట్ కామెంట్లకు కూల్ గా సమాధానమిచ్చారు మంత్రి సత్యవతి రాథోడ్. ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడితే అధికారంలోకి రారని ఆమె బీజేపీ నేతలకు చురకలంటించారు. ప్రజల మనసులు గెలిస్తే అధికారంలోకి రావడం సాధ్యమవుతుందంటూ ఆమె ప్రతిపక్ష నేతలకు హితవు చెప్పారు. సీఎం కేసీఆర్ పై కొందరు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, వారికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత టీఆర్‌‌ఎస్ నాయకులపై ఉందని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

Read also: Gujarat New CM: గుజరాత్‌లో రాజకీయ ఉత్కంఠకు తెర.. కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్