AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister Sabitha: మంచి మనసు చాటుకున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. యూ టర్న్ తీసుకొని మరీ వచ్చి..

Minister Sabitha Indra Reddy Talk With Women On Road: విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన మంచి మనసు చాటుకున్నారు. రోడ్డు పక్కన అచేతనంగా పడిఉన్న ఓ మహిళను కాన్వాయ్ ఆపి మరీ...

Minister Sabitha: మంచి మనసు చాటుకున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. యూ టర్న్ తీసుకొని మరీ వచ్చి..
Narender Vaitla
|

Updated on: Feb 13, 2021 | 3:44 PM

Share

Minister Sabitha Indra Reddy Talk With Women On Road: తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన మంచి మనసు చాటుకున్నారు. రోడ్డు పక్కన అచేతనంగా పడిఉన్న ఓ మహిళను కాన్వాయ్ ఆపి మరీ పరామర్శించారు. మంత్రి చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి శంకర్ పల్లి మండల పర్యటనకు వెళ్తోన్న సందర్భంలో ఈ సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం మంత్రి సబిత్రా ఇంద్రారెడ్డి చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి శంకర్ పల్లి మండల పర్యటనకు హైదరాబాద్ నుంచి బయలు దేరారు. ఈ సమయంలో మంత్రి కాన్వాయ్ లంగర్ హౌజ్ టిప్పుఖాన్‌పూల్ ప్రాంతం మీదుగా వెళుతుండగా.. మంత్రి రోడ్డు పక్కన ఎండలో అచేతనంగా పడిఉన్న ఓ మహిళలను గమనించారు. వెంటనే కాన్వాయ్ ఆపాలని డ్రైవర్‌ను ఆదేశించారు. కానీ అప్పటికే కాన్వాయ్ ఆ ప్రదేశం నుంచి ముందుకు వెళ్లిపోయింది. అయితే యూటర్న్ తీసుకొని మరీ ఆ మహిళ ఉన్న ప్రదేశానికి చేరుకున్న మంత్రి.. ఆమెను పరామర్శించారు. రోడ్డు పక్కన ఉన్న మహిళకు మాటలు రావని సైగలు చేయడంతో నీళ్లు తాగించి నీడలోకి వెళ్లాలని సూచించి.. తమ ప్రయాణాన్ని మళ్లీ మొదలు పెట్టారు సబితా ఇంద్రారెడ్డి. Also Read: Sharmila new party: తెలంగాణలో వైఎస్‌ షర్మిల కొత్త పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

Follow Us
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!
మొదటి రోజు అట్టర్ ఫ్లాప్ అన్నారు.. కట్ చేస్తే
మొదటి రోజు అట్టర్ ఫ్లాప్ అన్నారు.. కట్ చేస్తే
కూతురి ఫీజు కోసం మారథాన్ గెలిచింది.. చెప్పులు లేకుండానే..
కూతురి ఫీజు కోసం మారథాన్ గెలిచింది.. చెప్పులు లేకుండానే..
IT రంగంలో మళ్లీ భారీ నియామకాలు..1.50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు
IT రంగంలో మళ్లీ భారీ నియామకాలు..1.50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు
ఏళ్ళ తరబడి ఆస్తమాతో బాధ పడేవాళ్ళు 3 సార్లు ఇలా చేస్తే చాలు
ఏళ్ళ తరబడి ఆస్తమాతో బాధ పడేవాళ్ళు 3 సార్లు ఇలా చేస్తే చాలు