Telangana: అన్నా, నన్ను తీసుకుపో, మా అమ్మకు నేను ఒక్కడ్నే కొడుకును అంటూ గల్ఫ్ బాధితుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. అన్నా నువ్వే నన్ను కాపాడాలి అంటూ మంత్రి కేటీఆర్‌కు సోషల్ మీడియాలో మొర్రపెట్టుకున్నాడు ఆ యువకుడు. బతుకుదెరువు కోసం రెండు నెలలక్రితం దుబాయ్ వెళ్లిన సిరిసిల్ల యువకుడు ఇమ్రాన్, ఏజెంట్ల చేతిలో మోసపోయాడు. ఫ్రీ వీసా అంటూ దుబాయ్ పంపిన కంపెనీ మోసం చేసింది. పంపించేటప్పుడు ఒక పని చెప్పి, అక్కడికి వెళ్లాక మరో పని చేయించడంతో తట్టుకోలేకపోయాడు ఇమ్రాన్. అక్కడ ఉండలేక, ఇండియాకి తిరిగిరాలేక నరకయాతన అనుభవిస్తున్నాడు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తన ఫ్రెండ్స్‌కి చెప్పుకున్నాడు.
ఎలాగైనాసరే తనను తిరిగి ఇండియా తీసుకెళ్లాలంటూ ఏడుస్తూ పోస్ట్ పెట్టాడు ఇమ్రాన్. కేటీఆర్ అన్నా.. నన్ను ఘోరంగా ఇబ్బంది పెడుతున్నారు, ఫ్రీ విజిట్ వీసా అంటూ పంపి, ఆగమాగం చేస్తున్నారు. అన్నం లేదు-ఏం లేదు. నేనిక్కడ ఉండలేకపోతున్నా, దయచేసి నన్ను తీసుకుపో అన్నా అంటూ వేడుకున్నాడు. ఇమ్రాన్ ఫ్రెండ్స్ ఈ వీడియోను మంత్రి కేటీఆర్‌కి ట్యాగ్ చేయడంతో ఆయన స్పందించారు.
We will work with @cgidubai and @IndembAbuDhabi to bring you back to India @KTRoffice please coordinate with NRI affairs department https://t.co/gZWQHZ0p9D
— KTR (@KTRTRS) January 3, 2023
నిన్ను తిరిగి ఇండియా తీసుకురావడానికి కృషి చేస్తామంటూ రిప్లై ఇచ్చారు. దుబాయ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామన్నారు కేటీఆర్. అదేసమయంలో ఎన్నారై అఫైర్స్ డిపార్ట్‌మెంట్‌తో టచ్‌లో ఉండాలని సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..