Viral Video: చూస్తుండగానే రోడ్డుపై నుంచి ఒక్కసారిగా పొగలు.. ఏమైందని దగ్గరకెళ్లగా..

హైదరాబాద్‌లోని మియాపూర్ పీఎస్‌లో పరిధిలో భారీ పేడులు కలకలం రేపింది. బెలూన్స్‌కు గాలి నింపే ఓ సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో అక్కడే ఉన్న ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Viral Video: చూస్తుండగానే రోడ్డుపై నుంచి ఒక్కసారిగా పొగలు.. ఏమైందని దగ్గరకెళ్లగా..
Miyapur Cylinder Explosion

Edited By:

Updated on: Aug 08, 2026 | 9:42 PM

హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెను ప్రమాదం తప్పింది. మదీనాగూడలో ఒక్కసారిగా భారీ పేలుడు కలకలం రేపింది. జీఎస్‌ఎం మాల్ పక్కన బెలూన్లలో గాలి నింపేందుకు ఉపయోగిస్తున్న సిలిండర్ పేలడంతో ముగ్గురు గాయపడ్డారు. పేలుడు తీవ్రతకు అక్కడున్న వారు భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ప్రకాశ్ పాల్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పేలుడు ధాటికి అతని కాలికి తీవ్ర గాయమై, సగం కాలు ఎరిగి పడింది మరో ఇద్దరికి కూడా గాయాలు కావడంతో వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు అధికారులు.

అసలు సిలిండర్‌లో ఏ గ్యాస్ నింపారు..?

ఈ ఘటనలో ప్రధానంగా సిలిండర్ పేలుడుకు కారణమేంటన్న దానిపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బెలూన్లు నింపేందుకు ఉపయోగిస్తున్న సిలిండర్‌లో ఏ గ్యాస్ ఉంది? సిలిండర్‌కు అవసరమైన భద్రతా ప్రమాణాలు ఉన్నాయా? గడువు ముగిసిన లేదా నాసిరకం సిలిండర్‌ను వినియోగించారా? అధిక పీడనం కారణంగా పేలిందా? అనే అంశాలపై పోలీసులు సంబంధిత అధికారులు దృష్టి సాధించారు

రద్దీ ప్రాంతంలో పేలుడు.. తప్పిన పెను ప్రమాదం!

జీఎస్‌ఎం మాల్ సమీపంలో సాధారణంగా ప్రజల రాకపోకలు ఉంటాయి. అలాంటి ప్రాంతంలో సిలిండర్ పేలడం ఆందోళన కలిగిస్తోంది. బెలూన్లు నింపే సిలిండర్లను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? వాటిని ఎవరు తనిఖీ చేస్తున్నారు? వాటి వినియోగానికి అనుమతులు ఉన్నాయా? జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇలాంటి సిలిండర్లను ఉపయోగించేటప్పుడు పాటించాల్సిన భద్రతా నిబంధనలు అమలవుతున్నాయా? అన్న అంశాలు ఇప్పుడు కీలకంగా మారాయి.

మియాపూర్ పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. సిలిండర్ పేలడానికి అసలు కారణం ఏమిటి? నిర్లక్ష్యం ఉందా? సిలిండర్ నిర్వహిస్తున్న వ్యక్తి ఎవరు? అనే కోణాల్లో విచారణ జరుపుతున్నారు. పోలీసుల దర్యాప్తు పూర్తయితే ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది అధికారులు చెప్తున్నారు. \

వీడియో చూడండి..

మరిన్ని  తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us