Telangana: కాస్త లేటయినా సంచలన తీర్పు.. కామాంధుడికి ఉరిశిక్ష విధించిన పోక్సో కోర్టు..!

ఇటీవల కాలంలో మానవత్వం మరిచిన కామాంధులు చిన్నారులపై అత్యాచారం, లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. మైనర్‌ బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పదేళ్ల క్రితం చిన్నారి బాలికపై అత్యాచారం చేసి, ఆపై హత్యకు పాల్పడిన కామాంధుడు మహమ్మద్ ముకర్రంకు ఉరిశిక్ష విధించింది.

Telangana: కాస్త లేటయినా సంచలన తీర్పు.. కామాంధుడికి ఉరిశిక్ష విధించిన పోక్సో కోర్టు..!
Nalgonda Crime News

Edited By: Balaraju Goud

Updated on: Aug 14, 2025 | 6:12 PM

ఇటీవల కాలంలో మానవత్వం మరిచిన కామాంధులు చిన్నారులపై అత్యాచారం, లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. మైనర్‌ బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పదేళ్ల క్రితం చిన్నారి బాలికపై అత్యాచారం చేసి, ఆపై హత్యకు పాల్పడిన కామాంధుడు మహమ్మద్ ముకర్రంకు ఉరిశిక్ష విధించింది.

నల్గొండలో జరిగిన మైనర్ బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 12ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి.. ఆపై హత్యకు పాల్పడిన నిందితుడు మహమ్మద్‌ ముకర్రంకు ఉరిశిక్ష విధించింది. ఈ కేసులో పది సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం.. పోక్సో కోర్టు ఇన్‌చార్జి న్యాయమూర్తి తుది తీర్పును వెలువరించారు.

నల్లగొండ పట్టణం మాన్యం చెల్కకు చెందిన మహమ్మద్ ముక్రం.. హైదర్ ఖాన్ గూడలో 2013 ఏప్రిల్ 28న బాలిక ఇంట్లో ఒంటరిగాఉండటాన్ని గమనించిన ముకర్రం.. దొంగచాటుగా వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎక్కడ తన బండారం బయటపడుతుందోనని ఆమెను హత్య చేసి.. డెడ్‌బాడీని డ్రైనేజీలో పడేశాడు. మూడు రోజుల తర్వాత పోలీసులు బాలిక మృతదేహాన్ని గుర్తించారు. 2013లో జరిగిన ఈ ఘటన.. సభ్య సమాజాన్నిఉలిక్కి పడేలా చేసింది. నల్గొండ వన్‌టౌన్ పోలీసులు పోక్సో, మర్డర్‌లాంటి వేర్వేరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 2015లో పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు. సుదీర్ఘ వాదనలు, వాయిదాల తర్వాత నిందితుడికి ఉరిశిక్షతో పాటు లక్షా పదివేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది నల్గొండ జిల్లా న్యాయస్థానం.

నేరగాళ్లకు కఠిన శిక్షలు పడాల్సిందేనన్నారు పోలీసులు. ఇలాంటి తీర్పులు సమాజంలో న్యాయంపట్ల విశ్వాసాన్ని పెంచుతాయన్నారు. కోర్టు తీర్పుపై బాధిత కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది. తమ బిడ్డకు జరిగిన అన్యాయం మరెవ్వరికీ జరగకూడదని కోరుకుంది.

ఇలాంటి నేరాలకు సంబంధించి కఠిన శిక్షలు విధించడం ఇది మొదటిసారేం కాదు. గతంలో పలు కేసుల్లో కోర్టులు ఉరిశిక్షతో పాటు కఠినమైన శిక్షలు విధించాయి. పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌పోల్‌లో.. ఈ మధ్య పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 15ఏళ్ల కన్నకూతురిపై అత్యాచారం చేసి.. గొంతు నులిమి హత్య చేసిన నిందితుడైన తండ్రికి కోర్టు ఉరిశిక్ష విధించింది. ఘటన జరిగిన 15నెలల్లోనే విచారణ పూర్తి చేసి తీర్పిచ్చింది. పోస్టుమార్టం నివేదిక, డీఎన్‌ఏ ఆధారాలు, తల్లి వాంగ్మూలం లాంటి సాక్ష్యాల ఆధారంగా శిక్షను ఖరారు చేశారు. కాస్త లేటయినా కోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రజాసంఘాలు, మహిళా, విద్యార్థి సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..