
వారి భాషలు వేరు, దేశాలు వేరు.. అయినా వాళ్లిద్దరు ఒక్కటయ్యారు. ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెద్దలను ఒప్పించి మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి బంధానికి భాష, ప్రాంతాలు అడ్డుకావని.. ఇరువురి మనసులు కలిస్తే చాలు అని నిరూపించారు ఆదిలాబాద్ అబ్బాయి.. లండన్ అమ్మాయి.. ఇరువురూ ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి బంధు మిత్రుల సమక్షంలో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సీన్ ఎక్కడ జరిగిందంటే.. తెలుసుకోవాలంటే అడవుల జిల్లా ఆదిలాబాద్ కు వెళ్లాల్సిందే. మూడు ముళ్లతో ఒక్కటైనా లండన్ అమ్మాయి – ఆదిలాబాద్ అబ్బాయి.. జంటను పలువురు దీవించి శుభాకాంక్షలు తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కృష్ణానగర్ కు చెందిన భూశెట్టి మహేందర్ భారతీల కుమారుడు భూశెట్టి సాయి చరణ్ పదేళ్ల క్రితం కు లండన్ కు ఉన్నత చదువుల కోసం వెళ్లి అక్కడే వ్యాపారంలో స్థిరపడ్డారు. అదే సమయంలో లండన్ లోని కార్డిప్ చెందిన కిమ్ హెనోచ్ – గారెత్ హెనోచ్ ల కూతురు మియా మే తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న సాయిచరణ్ – మియామే లు పెద్దలను ఒప్పించి మూడు ముళ్లతో ఒక్కటవ్వాలని కోరుకున్నారు. ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో మే 10 న అంగరంగ వైభవంగా సాగిన వివాహవేడుకలో ఏడడుగులు వేసి మూడు ముళ్లతో ఇద్దరు ఒక్కటయ్యారు. మియామే తల్లిదండ్రులు ఇండియాకు వచ్చేందుకు అవకాశం లేకపోవడంతో సాయిచరణ్ మేనత్త పెళ్లి కూతురు తరుపున వివాహం జరిపించారు.
గత నెల ఇద్దరు కలిసి భారతదేశానికి వచ్చి ఇక్కడి సంప్రదాయం ప్రకారం పెళ్ళి చేసుకోవాలని అనుకున్నారు. వధువు మియామే కు తెలంగాణ సంప్రదాయాలు అందులోను ఆదిలాబాద్ వాతవరణం నచ్చడంతో హిందు సంప్రదాయ బద్దంగా వివాహం చేసుకోవాలని భావించింది. ఆమె కోరిక మేరకు భారత్ వచ్చిన ఈ జంట పెద్దల సమక్షంలో సంప్రదాయబద్దంగా వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
అయితే, ఈ పెళ్ళి వధువు మియామే తల్లిదండ్రులు రాకపోవడంతో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన బోడకుంటి నితీష్ వనజ దంపతులు కన్యాదానం చేసి పెళ్లి జరిపించారు. వారి దేశాలు, భాషలు వేరు వేరు అయినప్పటి వేదమంత్రాల సాక్షిగా బంధుమిత్రుల సమక్షంలో మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు సాయిచరణ్ – మియామేలు. ఈ వివాహానికి హాజరైన సాయిచరణ్ బంధుమిత్రులు అంతా నూతన దంపతులను ఆశీర్వదించి అభినందించారు. మూడు మూళ్ల బంధానికి దేశం, భాష అడ్డుకావని, ప్రేమకు ఎల్లలు లేవని నిరూపించిన ఈ పెళ్ళి గురించే అంతటా చర్చ కొనసాగుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..