Leopard Attack: కామారెడ్డి జిల్లాలో చిరుత పులి సంచారం.. ఆవు దూడలపై దాడి.. గ్రామస్తుల భయాందోళన

|

Jan 13, 2021 | 10:00 PM

Leopard Attack: కామారెడ్డి జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. మాచారెడ్డి మండలం సింగరాయిపల్లిలో చిరుత సంచారం తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. చిరుత...

Leopard Attack: కామారెడ్డి జిల్లాలో చిరుత పులి సంచారం.. ఆవు దూడలపై దాడి.. గ్రామస్తుల భయాందోళన
Follow us on

Leopard Attack: కామారెడ్డి జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. మాచారెడ్డి మండలం సింగరాయిపల్లిలో చిరుత సంచారం తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. చిరుత రెండు ఆవు దూడలపై దాడి చేయగా, దూడలు మృతి చెందాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

ఈ విషయాన్ని గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే ఈ మధ్య కాలంలో చిరుతల సంచారం ఎక్కువైపోయాయి. అటవీ ప్రాంతాల నుంచి పరిసర ప్రాంతాలు, గ్రామాల్లోకి వస్తుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. పశువుల కాపర్లు సైతం అడవుల్లోకి వెళ్లాలంటే భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే చిరుతకు ఎన్నో పశువుల బలయ్యాయి.అటవీ శాఖ అధికారులు స్పందించి చిరుతను పట్టుకొని తమను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.