దివ్యాంగులకు ఉచిత ఉపకరణాల పంపిణీ దరఖాస్తు గడువు పెంపు.. ఆన్ లైన్‌లో మాత్రమే ధరఖాస్తు చేసుకోవాలన్న మంత్రి

|

Feb 05, 2021 | 4:47 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలను ఉచితంగా అందజేస్తుందని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, దివ్యాంగుల సంక్షేమ శాఖల..

దివ్యాంగులకు ఉచిత ఉపకరణాల పంపిణీ దరఖాస్తు గడువు పెంపు.. ఆన్ లైన్‌లో మాత్రమే ధరఖాస్తు చేసుకోవాలన్న మంత్రి
Follow us on

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలను ఉచితంగా అందజేస్తుందని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, దివ్యాంగుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. ఈ ఉపకరణాలు పొందేందుకు గాను దరఖాస్తు చేసుకునే చివరి గడువును ఈనెల 15వ తేదీ వరకు పొడిగించామని మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. వీటి కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామని మంత్రి పేర్కొన్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2020-21) దివ్యాంగులకు వివిధ రకాలైన 13,195 ఉపకరణాలు ఉచితంగా పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారని కొప్పుల పేర్కొన్నారు. ఈ మేరకు రూ.20.41 కోట్ల వ్యయంతో త్రిచక్ర వాహనాలు, వీల్​ఛైర్స్​, లాప్​టాప్స్​, 4జీ స్మార్ట్​ ఫోన్స్​, వినికిడి యంత్రాలు, చేతికర్రలు, ఎంపీ3 ప్లేయర్స్​ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రూ.90 వేల విలువ చేసే 900 రిట్రోఫెట్టెడ్​ మోటారు వాహనాలు కూడా అవసరమైన వారికి అందజేస్తామని వివరించారు.

ఉపకరణాల కోసం ఈనెల 25 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవలసి ఉండగా, పలువురి విజ్ఞప్తి మేరకు చివరి తేదీని ఈనెల 15వరకు పొడిగిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఆన్‌లైన్‌లో www.obmms.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హతగల దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా మంత్రి కోరారు. జిల్లా కమిటీ ఎంపిక చేసిన దరఖాస్తుదారులకు ఉపకరణాలను ఉచితంగా అందజేస్తామని మంత్రి తెలిపారు.

 

Reas more:

రాష్ట్ర బడ్జెట్ లో మూడో వంతు వారికోసమే.. కీలక ప్రకటన చేసిన తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి

ఈ నెల 7న సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గం భేటీ.. పలు కీలక అంశాలపై చర్చించనున్న సమావేశం