
మాజీ మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు గాయపడ్డారు. సోమవారం గేమ్స్ ఆడుతుండగా హిమాన్షు స్వల్పంగా గాయపడడంతో ఆయన్ను గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌కు తరలించారు. ఆయన్ను పరీక్షించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం హిమాన్షు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. అయితే విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు హాస్పిటల్‌కు చేరుకున్నారు. అలాగే కేసీఆర్ సైతం ఎర్రవల్లి ఫామ్‌హౌస్ నుంచి హాస్పిటల్‌కు వెళ్లి మనవడిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగితెలుసుకున్నారు.
అయితే ఈ ప్రమాదంపై కేటీఆర్ తనయుడు హిమాన్షు సైతం స్పందించాడు. ఈ ఘటనపై ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు హిమాన్షు. సోమవారం రాత్రి చిన్నపాటి గాయం కారణంగా హాస్పిటల్‌లో చేర్చారని హిమాన్షు తెలిపాడు. గాయం నుంచి కోలుకునేందుకు కాస్త సమయం పడుతుందని.. అంతవరకు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు హిమాన్షు తెలిపాడు. అలాగే ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని హిమాన్షు పేర్కొన్నాడు.
Last night, I was admitted to the Hospital following a sports-related injury.
I’m doing well, and the doctors have advised me to take some time to rest and recover.
Thank you all for your understanding, love, and support. Looking forward to being back soon❤️
— Himanshu Rao Kalvakuntla (@TheHimanshuRaoK) July 7, 2026
అలాగే ఈ ఘటనపై అటు కేటీఆర్ సైతం స్పందించారు. సోమవారం గేమ్స్ ఆడుతుండగా హిమాన్షుకు గాయం అయిందని.. ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. వైద్యులు కొన్ని రోజులు విశ్రాంతి కావాలని సూచించారని.. త్వరలోనే కోలుకుంటాడని తెలిపారు. హిమాన్షు ఆరోగ్యం గురించి అడిగిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
My son Himanshu suffered a minor sports injury yesterday evening and is undergoing treatment
He should be back to being normal in a few days. Thank you to all who’ve been calling and texting with concern
— KTR (@KTRBRS) July 7, 2026
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.