KTR: హత్యలు చేయడం దుర్మార్గం.. మేం ఫ్యాక్షన్‌ను ప్రోత్సహించాలనుకోలేదు.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు..

|

Jan 14, 2024 | 8:11 PM

గత పదేళ్లలో తెలంగాణలో ఎన్నడూ హింసాయుత వాతావరణం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా గంట్రావుపల్లిలో ఇటీవల హత్యకు గురైన మల్లేష్ కుటుంబాన్ని కేటీఆర్ ఆదివారం పరామర్శించారు. మల్లేష్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి, మల్లేష్ భార్య పిల్లలు, కుటుంబ సభ్యులతో మాట్లాడి కేటీఆర్ వారికి మనోధైర్యాన్ని ఇచ్చారు

KTR: హత్యలు చేయడం దుర్మార్గం.. మేం ఫ్యాక్షన్‌ను ప్రోత్సహించాలనుకోలేదు.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు..
Ktr
Follow us on

గత పదేళ్లలో తెలంగాణలో ఎన్నడూ హింసాయుత వాతావరణం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా గంట్రావుపల్లిలో ఇటీవల హత్యకు గురైన మల్లేష్ కుటుంబాన్ని కేటీఆర్ ఆదివారం పరామర్శించారు. మల్లేష్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి, మల్లేష్ భార్య పిల్లలు, కుటుంబ సభ్యులతో మాట్లాడి కేటీఆర్ వారికి మనోధైర్యాన్ని ఇచ్చారు. మల్లేష్ పిల్లల పూర్తి బాధ్యతను పార్టీ తీసుకుంటానని తెలిపిన కేటీఆర్, వారికి పార్టీ తరపున ఐదు లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. రిటైర్డ్ ఆర్మీ జవాన్ మల్లేష్ అహర్నిశలు పార్టీ గెలుపు కోసం పనిచేశారన్నారు. బీఆర్ఎస్ ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ రాజకీయ హత్యలు జరగలేదని.. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా రాజకీయ ప్రత్యర్థులు, రాజకీయ కక్షతో మల్లేష్ ను హత్య చేశారన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, కానీ ఈ విధంగా హత్యలు చేయడం దుర్మార్గమన్నారు.

దాడుల సంస్కృతి మంచిది కాదన్న కేటీఆర్‌.. తాము ఫ్యాక్షన్ సంస్కృతిని పెంచాలనుకోలేదు కాబట్టే పదేళ్లలో అంతా ప్రశాంతంగా ఉందన్నారు. ఈ హత్యరాజకీయలను అందరూ ఖండించాలని విజ్ఞప్తి చేశారు. మల్లేష్‌ మర్డర్‌ పై పోలీసులు ప్రజలకు వాస్తవవాలు తెలియజేయాలని.. నిస్పక్షపాత విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ప్రతీ కార్యకర్తకూ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు.

అంతకు ముందు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఆల వెంకటేశ్వర రెడ్డి సోదరుడు ఆల శశివర్ధన్ రెడ్డి ఇటీవల గుండెపోటుతో చనిపోయారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..