తెలంగాణ వాసులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో మరో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి కేంద్ర నిర్ణయం!

తెలంగాణ వాసులకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మరో గుడ్‌న్యూస్ చెప్పారు. తెలంగాణలో మరో ఎయిర్‌ నిర్మాణానికి సిద్దమవుతున్నట్టు స్పష్టం చేశారు. శ్రీ సీతారామచంద్రస్వామి కొలువై ఉన్న భద్రాద్రి జిల్లాల్లో త్వరలో కొత్త ఎయిర్‌ పోర్టు నిర్మించాలను ఇందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు.

తెలంగాణ వాసులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో మరో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి కేంద్ర నిర్ణయం!
Kothagudem New Airport Project

Edited By:

Updated on: Sep 01, 2026 | 3:38 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం నిర్మించే బాధ్యత తనదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉన్న ఈ ప్రాంత ప్రజల కోసం కచ్చితంగా విమానాశ్రయాన్ని నిర్మించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఎయిర్‌పోర్టు ప్రతిపాదనకు సంబంధించి నాలుగు నుంచి ఐదు ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలించేందుకు కేంద్ర సాంకేతిక బృందం సెప్టెంబర్ 7న తెలంగాణలో పర్యటించనుందని ఆయన వెల్లడించారు.

కేంద్ర మంత్రితో తుమ్మల భేటీ

భద్రాచలం-కొత్తగూడెం ప్రాంతంలో విమానాశ్రయ ఏర్పాటు కోసం నిరంతరం కృషి చేస్తున్న రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడితో భేటీ అయ్యారు. గతంలో పరిశీలించిన రెండు స్థలాలు సాంకేతిక కారణాలతో అనుకూలంగా లేవని తేలడంతో, తాజాగా మరో నాలుగు నుంచి ఐదు ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించినట్లు కేంద్రమంత్రికి వివరించారు.

కొత్తగా గుర్తించిన స్థలాల్లోని భౌగోళిక, వాతావరణ పరిస్థితులతో పాటు విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన సాంకేతిక సాధ్యాసాధ్యాలను కేంద్ర సాంకేతిక బృందం సెప్టెంబర్ 7న క్షేత్రస్థాయిలో పరిశీలించనుందని.. ఈ బృందం అందించే నివేదిక అనుకూలంగా వచ్చిన తర్వాత, కొత్తగూడెం విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టనుందని తెలిపారు.ఎయిర్‌పోర్టు ఏర్పాటు కోసం కేంద్ర సాంకేతిక బృందాన్ని పంపేందుకు చొరవ చూపిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి, కేంద్ర ప్రభుత్వానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Kothagudem Airport Project

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us