
రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలే ఉంటాయ్.. అని ఏజోల్డ్ డైలాగ్ ఒకటుంది. అంటే, ఎవ్వరి పతనాన్ని వాళ్లే డిసైడ్ చేసుకుంటారని అర్థం కాబోలు. ఆమాటకొస్తే, తెలంగాణ ఫైర్‌బ్రాండ్ కొండా సురేఖ ఇటువంటి ఆత్మహత్యలు లెక్కలేనన్నిసార్లు చేసుకున్నారు. కానీ, పతనమైనట్టే అయ్యి, మళ్లీ పీక్స్‌కి చేరడాన్ని మేనరిజమ్‌గా మార్చుకుంటారు. పార్టీలు మారినా పవర్‌సెంటర్ మారదు. పదవుల కోసం పోరాడినా, మాటపట్టింపులతో ఆ పదవుల్ని కాలదన్నుకున్నా.. అన్నీ ఆమెకే చెల్లు. టచ్ చేసి చూడు రేంజ్‌లో ఉంటుంది కొండా ఫ్యామిలీ స్పీడు. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రితోనే ఢీకొట్టి, హైకమాండ్ బుర్రల్ని వేడెక్కించి, గాంధీభవన్ బైటికొచ్చి నిలబడ్డారు. సొంత పాపులారిటీల కంటే, కాంట్రవర్సీలే పెట్టుబడిగా ఎదిగి, కటౌట్ సైజుల్ని పెంచుకున్న కొండా ఫ్యామిలీకి వాట్ నెక్స్ట్? మరోసారి పొలిటికల్ చౌరస్తాలో వచ్చి నిలబడ్డ కొండాను ఏ పార్టీ స్వాగతిస్తుంది? ఇవన్నీ అటుంచితే, శాపమో వరమో తెలీని కొండా గతం గురించైతే మాట్లాడుకునే తీరాలి. ఎందుకంటే, ఇదొక పవర్‌ఫుర్ కమర్షియల్ అండ్ క్రేజీ స్టోరీ కనుక. బర్తరఫ్ చెయ్యడానికి ముందురోజు ఢిల్లీలో ఖర్గేని కలిసొచ్చిన తర్వాత కొండా సురేఖ ఇచ్చిన ఎక్స్‌ప్లనేషన్ ఇది. సంజాయిషీ ఇచ్చినట్టే ఇచ్చి సాకిరేవు పెట్టినట్టే ఉంది. నన్ను తప్పిస్తే మీకే ముప్పు జర జూస్కోండి మరి.. అని...