కిన్నెర వాయిద్యం అనగానే.. తెలంగాణలో చాలామందికి దర్శనం మొగులయ్య గుర్తుకువస్తారు. తరాలు మారుతున్నా.. కొత్త కొత్త టెక్నాలజీ పుట్టుకొస్తున్నా ఆనాటి కళను వెలుగులోకి తీస్తూ కిన్నెరకు విశేష గుర్తింపు తీసుకొచ్చారాయన. ఆయన సేవలకు కేంద్రం ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చింది. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా గుర్తించి ఆయన కు ఆర్థికసాయం చేసింది. తాజాగా మొగిలయ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో ఆయన నివాసంలో కలుసుకున్నారు. సీఎం ముందు కిన్నెర కళను ప్రదర్శించడంతో స్వయంగా చూసి ఫిదా అయ్యారు. పుట్టిండో పులి పిల్ల.. పాలమూరు జిల్లాలోన అంటూ పాటను పాడారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి మొగులయ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. మొగిలయ్య వెంట తెలంగాణ మంత్రి కొండ సురేఖ కూడా ఉన్నారు.