
నగరంలోని టూటౌన్ పీఎస్‌లో ఎస్సైగా పని చేస్తున్న చంద్ర శేఖర్ భార్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెల్తే.. కరీంనగర్ వన్ టౌన్ పరిధిలోని హునుమాన్ నగర్‌లో నివాసం ఉంటున్న చంద్ర శేఖర్‌కు,దివ్య అనే యువతితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీళ్లకు ప్రస్తుతం ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే మంగళవారం ఇంట్లోనే ఉన్న దివ్వ గన్నేరు పప్పు దంచుకొని తిన్నట్టు తెలుస్తోంది. విషపూరితమైన గన్నేరు పప్పు తినడంతో దివ్వ తీవ్ర అస్వస్థకు గురైంది. విషయం తెలుసకున్న భర్త చంద్రశేఖర్ వెంటనే దివ్యను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు హైదరాబాద్‌కు తరలించాలని సూచించండంతో వెంటనే ఆమెను హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతుండగానే దివ్వ మరణించారు. ఈ విషయం తెలిసిన భర్తతో పాటు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చిరు ప్రాయంలోనే తల్లిని కోల్పోయిన ఆ బిడ్డలను చూసి స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
అయితే దివ్వ కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు మృతిరాలి భర్త చంద్రశేఖర్ చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా దివ్వ కడుపు నొప్పితో బాధ పడుతున్నారని అంటున్నారు. ఎంతో సంతోషంగా ఉన్న కుటుంబంలో ఈ ఆత్మహత్య తీవ్ర విషదాన్ని నింపింది. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.