స్కూల్ బ్యాగేజీ.. అయ్యింది ఇక ఈజీ..: తల్లిదండ్రుల వినూత్న ఆలోచన

స్కూల్ బ్యాగ్ బరువుతో భుజాలపై ఒత్తిడి పడుతున్న చిన్నారులకు కరీంనగర్‌కు చెందిన ఓ విద్యార్థి తల్లిదండ్రులు సింపుల్‌గానే అదిరిపోయే సొల్యూషన్ చూపించారు. చిన్న ట్రాలీకి స్కూల్ బ్యాగ్‌ను అనుసంధానించి, పిల్లలు భుజాన బ్యాగ్ మోయాల్సిన అవసరం లేకుండా చేశారు. ఈ స్మార్ట్ ఐడియా ఇప్పుడు ఇతర పేరెంట్స్‌ను కూడా ఆకట్టుకుంటోంది.

స్కూల్ బ్యాగేజీ.. అయ్యింది ఇక ఈజీ..: తల్లిదండ్రుల వినూత్న ఆలోచన
School Bag

Edited By:

Updated on: Aug 25, 2026 | 12:15 PM

ఈ రోజుల్లో స్కూల్ బ్యాగ్ అంటే పిల్లలకు బ్యాగ్ కాదు.. మినీ జిమ్ ఎక్విప్‌మెంట్! పుస్తకాలు, నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్, లంచ్ బాక్స్.. ఇలా అన్నీ కలిపి బ్యాగ్ బరువు పిల్లల బాడీ వెయిట్‌కు మించి పోతున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఫలితంగా చిన్నారులు భుజాలు వంచుకుని నడవడం, అలసిపోవడం, వెన్నునొప్పితో ఇబ్బంది పడటం కామన్ అయిపోయింది.

ఇలాంటి ప్రాబ్లమ్‌కు కరీంనగర్‌కు చెందిన ఓ విద్యార్థి పేరెంట్స్ ఇచ్చిన సొల్యూషన్ మాత్రం సింపుల్.. కానీ అదిరిపోయే స్మార్ట్ ఐడియా! మార్కెట్‌లో దొరికే ఓ చిన్న సైజు ట్రాలీని కొనుగోలు చేసి.. దానికి స్కూల్ బ్యాగ్‌ను కనెక్ట్ చేశారు. అంతే.. ఇప్పటి వరకు భుజాలపై మోసిన బ్యాగ్‌ను.. ఇప్పుడు పిల్లాడు ఈజీగా ట్రాలీపై లాక్కుంటూ స్కూల్‌కు వెళ్లొచ్చు. నో హెవీ బ్యాగ్.. నో షోల్డర్ పెయిన్!

కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో చదువుతున్న ఈ విద్యార్థి ఇప్పుడు ప్రతిరోజూ బ్యాగ్‌ను భుజాన వేసుకునే టెన్షన్ లేకుండా ట్రాలీని లాక్కుంటూ స్కూల్‌కు వెళ్తున్నాడు. ఈ సీన్ చూసిన తోటి విద్యార్థులు, పేరెంట్స్ కూడా ‘అరే.. ఐడియా అదిరిందే!’ అంటూ మెచ్చుకుంటున్నారు. కొందరు పేరెంట్స్ అయితే ఇదే ఐడియాను తమ పిల్లలకు కూడా ట్రై చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

నిజానికి పిల్లల స్కూల్ బ్యాగ్ బరువు తగ్గించాలని ఎన్నో ఏళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది. స్కూల్ యాజమాన్యాలు, విద్యాశాఖ కూడా పలు సూచనలు చేస్తున్నా.. ప్రాక్టికల్‌గా చూస్తే పిల్లల బ్యాగ్ బరువు మాత్రం ఇంకా పెద్ద సమస్యగానే ఉంది. అలాంటి సమయంలో ప్రాబ్లమ్‌ను మార్చలేకపోతే.. దాన్ని మేనేజ్ చేయడానికి కొత్త మార్గం వెతుక్కోవచ్చు అని ఈ పేరెంట్స్ చూపించారు.

ఇది కేవలం ట్రాలీకి బ్యాగ్ తగిలించిన చిన్న ప్రయోగంలా కనిపించినా.. దీని వెనుక ఉన్న ఆలోచన మాత్రం చాలా పెద్దది. పిల్లల ఆరోగ్యం, సౌకర్యం గురించి ఆలోచిస్తే.. మన చుట్టూ అందుబాటులో ఉన్న చిన్న చిన్న వస్తువులతోనే కొన్ని సమస్యలకు సింపుల్ సొల్యూషన్స్ కనిపెట్టొచ్చు.

‘స్కూల్ బ్యాగ్ మోయాలి.. కానీ భుజాల మీదే మోయాలనే రూల్ ఏం లేదు కదా!’ అన్నట్టుగా కరీంనగర్ పేరెంట్స్ చేసిన ఈ స్మార్ట్ ఎక్స్‌పెరిమెంట్ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. పిల్లల భుజాలపై బరువు తగ్గించేందుకు.. ఈ చిన్న ట్రాలీ ఐడియా పెద్ద రిలీఫ్‌గా మారుతుందేమో చూడాలి!

Loading...
Unable to load recommendations.
Follow Us