Watch: ఓ చిన్ని పిచ్చుక.. చిన్నారి పిచ్చుక.. హృదయాలను కదిలిస్తున్న కలెక్టరమ్మ పాడిన పాట..

అంతర్జాతీయ బాలికల దినోత్సవం పురస్కరించుకొని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి స్వయంగా ఆలపించిన "ఓ చిన్ని పిచ్చుక.. చిన్నారి పిచ్చుక" పాట వీడియో పాటను ఆవిష్కరించారు. ఈ పాట సమాజంలో మార్పు కోసం ఆవిష్కరించారు.

Watch: ఓ చిన్ని పిచ్చుక.. చిన్నారి పిచ్చుక.. హృదయాలను కదిలిస్తున్న కలెక్టరమ్మ పాడిన పాట..
Pamela Satpathy Ias

Edited By: Shaik Madar Saheb

Updated on: Oct 16, 2025 | 11:52 AM

“ఓ చిన్ని పిచ్చుక.. చిన్నారి పిచ్చుక” పాటను కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి స్వయంగా ఆలపించారు.. ఈ పాట శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అంతర్జాతీయ బాలికల దినోత్సవం పురస్కరించుకొని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి స్వయంగా ఆలపించిన “ఓ చిన్ని పిచ్చుక.. చిన్నారి పిచ్చుక” పాట వీడియో పాటను ఆవిష్కరించారు. హిందీలో స్వానంద్ కిర్కిరే అనే రచయిత రాసి పాడిన ఈ పాటను రచయిత, తెలుగు ఉపాధ్యాయులు నంది శ్రీనివాస్ తెలుగులోకి అనువదించగా కలెక్టర్ పాడారు.

ఆవిష్కరణ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే పాల్గొన్నారు.“ఓ చిన్ని పిచ్చుక” అనేది “ఓ రి చిరయియా” అనే అసలు గీతానికి తెలుగు రూపాంతరం, ఇది సత్యమేవ జయతే కార్యక్రమంలో ప్రదర్శించారు. ఈ సృజనాత్మక ప్రయత్నం లింగ హింస, అక్రమ లింగ నిర్ధారణ, ఆడ శిశు హత్య – శిశు హత్యలపై అవగాహన పెంపొందించడానికి రూపొందించబడింది.

వీడియో చూడండి..

కాగా.. ఈ పాటను కరీంనగర్ జిల్లా కలెక్టర్.. పమేలా సత్పతి అద్భుతంగా పాడారు.. దీనిని చూసి పలువురు ఆమెను అభినందిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..