ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలల పునఃప్రారంభం.. ఏర్పాట్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జనగాం కలెక్టర్‌ నిఖిల

తెలంగాణలో ఫిబ్రవరి 1 నుండి ప్రారంభమయ్యే పాఠశాలల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జనగాం జిల్లా కలెక్టర్..

ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలల పునఃప్రారంభం.. ఏర్పాట్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జనగాం కలెక్టర్‌ నిఖిల

Updated on: Jan 31, 2021 | 12:19 AM

తెలంగాణలో ఫిబ్రవరి 1 నుండి ప్రారంభమయ్యే పాఠశాలల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జనగాం జిల్లా కలెక్టర్ కె. నిఖిల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలను కలెక్టర్ కె నిఖిల ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా పాలకుర్తి మండలంలోని తొర్రూరు గ్రామ ప్రభుత్వ పాఠశాల, పాలకుర్తిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సాంఘీక సంక్షేమ ఆశ్రమ పాఠశాల, కళాశాలలను పరిశీలించారు.

పాఠశాలల్లోని అన్ని గదులు, కిచెన్, డార్మెటరిలను సానిటైజింగ్ చేయాలని అధికారులను కలెక్టర్‌ నిఖిల ఆదేశించారు. పాఠశాలల పరిసరాలను గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందిచే శుభ్రం చేయించాలని సూచించారు. 9వ తరగతి నుండి ఆపై తరగతుల విద్యార్థులకు మాత్రమే పాఠశాలలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. తరగతి గదులు, విద్యార్థుల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు.

ఉపాధ్యాయులు, విద్యార్థుల సంఖ్యను బట్టి తరగతుల షెడ్యూల్ రూపొందించాలని, సీటింగ్ ఏర్పాట్లలో అన్ని జాగ్రత్తలు పాటించాలని పాఠశాల అధికారులకు సూచించారు. డెటాల్, లిక్విడ్ సోప్, సానిటైజర్లు అవసరం మేరకు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కోవిడ్-19 నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రతపై పిల్లలకు అవగాహన కల్పించాలని, తరచుగా చేతులు శుభ్రం చేసుకునేలా చూడాలని కోరారు.

 

Job Fair: నిరుద్యోగులకు శుభవార్త.. హైదరాబాద్‌లో టీసేవా జాబ్‌ ఫెయిర్‌.. ఇంటర్‌ నుంచి…

Loading...
Unable to load recommendations.
Follow Us