MPDO Suicide Attempt: జక్రాన్‌పల్లి ఎంపీడీవో ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం.. హైదరాబాద్‌కు తరలింపు

|

Jan 15, 2021 | 7:11 PM

MPDO Suicide Attempt: నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి ఎంపీడీవో భారతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. జక్రాన్‌పల్లి నుంచి సిరికొండకు డిప్యూటేషన్‌ వేయడంతో..

MPDO Suicide Attempt: జక్రాన్‌పల్లి ఎంపీడీవో ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం.. హైదరాబాద్‌కు తరలింపు
Follow us on

MPDO Suicide Attempt: నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి ఎంపీడీవో భారతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. జక్రాన్‌పల్లి నుంచి సిరికొండకు డిప్యూటేషన్‌ వేయడంతో తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. అయితే సిరికొండకు వెళ్లలేక నిద్రమాత్రలు మింగి ఆ ఘటనకు పాల్పడ్డారు. వెంటనే ఆమెను చికిత్స నిమత్తం ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

కాగా, డిప్యూటేషన్‌ను ఆపాలని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు ఎంపీడీవో విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల సమస్య వల్ల సిరికొండకు వెళ్లలేనని ఎమ్మెల్యేకు విన్నవించినట్లు తెలుస్తోంది. ఎంపీడీవో ఆత్మహత్యాయత్నంపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.

Also Read:

Crime News: కృష్ణా జిల్లాలో ఘోరాతి ఘోరం.. కంటనీరు తెప్పిస్తున్న ఘటన.. సరిగ్గా ఏడాది కూడా నిండని చిన్నారి

Cobra Commando: మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలపై ఆపరేషన్‌.. తుపాకీతో కాల్చుకుని కోబ్రా కమాండో ఆత్మహత్య..!