Revanth Reddy: అధికారులకు రేవంత్ రెడ్డి తొలి ఆదేశం.. సీఎంగా తొలి సంతకం ఆ ఫైల్ మీదే..!

తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎల్పీ భేటీ అనంతరం.. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించింది. సమిష్టి నిర్ణయాలతో ముందుకు వెళ్తారని.. డిసెంబర్ 7న ప్రమాణం చేస్తారని ఎఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.

Revanth Reddy: అధికారులకు రేవంత్ రెడ్డి తొలి ఆదేశం.. సీఎంగా తొలి సంతకం ఆ ఫైల్ మీదే..!
Revanth Reddy
Follow us

|

Updated on: Dec 05, 2023 | 9:55 PM

తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎల్పీ భేటీ అనంతరం.. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించింది. సమిష్టి నిర్ణయాలతో ముందుకు వెళ్తారని.. డిసెంబర్ 7న ప్రమాణం చేస్తారని ఎఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. కాగా.. తనను సీఎల్పీ నేతగా ఎంపిక చేయడం పట్ల ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్‌ అగ్రనేతలైన ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంకకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అండగా నిలిచిన కాంగ్రెస్ సైనికులకు రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

అంతేకాకుండా తుఫాన్ పరిణామాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ రేవంత్ రెడ్డి మరో ట్వీట్ చేశారు. సీఎల్పీ నేతగా ఎన్నికైనట్టు ప్రకటన రాకముందే ఈ ట్వీట్ చేశారు. తెలంగాణలో పలు జిల్లాలలో తుఫాను ప్రభావంపై ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వరి ధాన్యం తడిచిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని.. ఏజెన్సీ, లోతట్టు ప్రాంతాల్లో జన జీవనానికి ఇబ్బంది కలుగకుండా చూడాలని.. అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలంటూ కోరారు.

రేవంత్ రెడ్డి ట్వీట్..

పార్టీ అధిష్టానం పిలుపుతో ఢిల్లీ వెళ్లిన రేవంత్.. అధిష్టానంతో చర్చలు జరిపి కేబినెట్ కూర్పుపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఈ గురువారం రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను వ్యక్తిగతంగా కలిసి రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు.

రేవంత్ రెడ్డి ట్వీట్..

ఇదిలా ఉంటే సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టగానే.. ముందుగా ఆరు గ్యారెంటీలపైనే సంతకం చేయనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆరు గ్యారెంటీలపై రేవంత్ మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. మొదటి సంతకం గ్యారెంటీలపై ఉంటుందని చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే.. ఆరుగ్యారెంటీలకు సంబంధించిన ఫైళ్ల పై సంతకం పెడతారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఇవే..

  • మహాలక్ష్మి పథకం కింద రూ. 2,500, రూ. 500లకే మహిళలకు గ్యాస్‌ పిలిండర్‌, టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
  • రైతు భరోసా కింద రూ.15 వేల పెట్టబడి సాయం, వ్యవసాయ కూలీలకు రూ. 12 వేల సాయం, వరి పంటకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్‌
  • గృహ అవసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌
  • గృహ నిర్మాణానికి రూ.5లక్షల సాయం
  • విద్యార్థులకు రూ.5లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్‌ స్కూల్‌
  • వృద్ధులకు నెలకు రూ. 4వేల చొప్పున పెన్షన్‌, రూ. 10 లక్షల వరకూ రాజీవ్‌ ఆరోగ్యశ్రీ భీమా

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..