పెళ్లైన 4 రోజులకే పుట్టింటికొచ్చిన నవవధువు.. అసలు విషయం తెలిసి తల్లిదండ్రులు షాక్!

తమ కూతురికి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు ఆ తల్లిదండ్రులు. అత్తవారింట్లో అనుకువగా నడుచుకోవాలని చెప్పడమే కాదు.. భర్తతో ఎన్ని గొడవలు వచ్చినా సర్డుకుపోవాలని నచ్చజెప్పారు. కట్ చేస్తే.. 4 రోజులకే తిరిగి పుట్టింటికి వచ్చేసింది ఆ నవవధువు. దీంతో ఒక్కసారిగా షాకైన ఆ యువతి తల్లిదండ్రులు..

పెళ్లైన 4 రోజులకే పుట్టింటికొచ్చిన నవవధువు.. అసలు విషయం తెలిసి తల్లిదండ్రులు షాక్!
Marriage
Follow us

|

Updated on: May 09, 2024 | 12:44 PM

తమ కూతురికి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు ఆ తల్లిదండ్రులు. అత్తవారింట్లో అనుకువగా నడుచుకోవాలని చెప్పడమే కాదు.. భర్తతో ఎన్ని గొడవలు వచ్చినా సర్డుకుపోవాలని నచ్చజెప్పారు. కట్ చేస్తే.. 4 రోజులకే తిరిగి పుట్టింటికి వచ్చేసింది ఆ నవవధువు. దీంతో ఒక్కసారిగా షాకైన ఆ యువతి తల్లిదండ్రులు.. అసలేం జరిగిందని ఆరా తీయగా.. అల్లుడు చెప్పిన కారణానికి దెబ్బకు కంగుతిన్నారు. ‘మీ అమ్మాయి ఇంట్లో అన్నం తినడం లేదని.. కేవలం జ్యూసులు మాత్రమే తాగుతోందని’ అది నచ్చకే పుట్టింటికి పంపించినట్టు చెప్పుకొచ్చాడు. దీంతో ఆ నవ వధువు, ఆమె తరపు బంధువులు కలిసి భర్త ఇంటి ముందు ధర్నా చేపట్టారు. ఈ ఘటన తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకెళ్తే.. బెల్లంపల్లి మండలం కసిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన ప్రవీణ్‌కు మంచిర్యాలకు చెందిన ఓ యువతితో ఏప్రిల్ 24న వివాహమైంది. కట్ చేస్తే.. పెళ్లైన నాలుగో రోజే భర్త ప్రవీణ్.. వధువును తీసుకొచ్చి పుట్టింటి దగ్గర విడిచిపెట్టాడు. ఎందుకని అడగ్గా.. ఆమె ఇంట్లో అన్నం తినడం లేదని, జ్యూస్‌‌లే తాగుతోందని అతడు చెప్పినట్టు సదరు యువతి తల్లిదండ్రులు చెప్పారు. దీనికి వరుడు తల్లిదండ్రులు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా.. తమకేది సంబంధం లేదన్నట్టు సమాధానం ఇస్తున్నారని యువతి కుటుంబసభ్యులు తెలిపారు. నిర్లక్ష్యపు మాటలతో మాట దాటవేస్తున్నారని ఆరోపించారు. దీంతో ఆ నవ వధువు, ఆమె తరపు బంధువులు కలిసి భర్త ఇంటి ముందు ధర్నా చేపట్టారు. తమ అమ్మాయితో కాపురం చేయడం అతడికి ఇష్టం లేదని.. ఇంటికి వస్తే తాళం వేసుకుని బయటకు వెళ్తున్నారని యువతి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ అంశంపై స్థానిక ఎస్సై నరేష్ ఇరు వర్గాల వారిని కౌన్సిలింగ్‌కు రావాలని కోరారు.

Latest Articles
కో లివింగ్ కల్చర్‎తో తస్మాత్ జాగ్రత్త.. ఈ పరిస్థితులు తలెత్తొచ్చు
కో లివింగ్ కల్చర్‎తో తస్మాత్ జాగ్రత్త.. ఈ పరిస్థితులు తలెత్తొచ్చు
తారక్ సోషల్ మీడియాలో ఫాలో అయ్యే ఆ స్పెషల్ పర్సన్ ఎవరంటే..?
తారక్ సోషల్ మీడియాలో ఫాలో అయ్యే ఆ స్పెషల్ పర్సన్ ఎవరంటే..?
ని రిటైర్మెంట్‌పై కీలక అప్‌డేట్.. ఎప్పుడు చేయనున్నాడంటే?
ని రిటైర్మెంట్‌పై కీలక అప్‌డేట్.. ఎప్పుడు చేయనున్నాడంటే?
ఇది క్రేజ్ అంటే.. ఎన్టీఆర్ బర్త్ డే.. దుమ్మురేపిన జపాన్ ఫ్యాన్స్.
ఇది క్రేజ్ అంటే.. ఎన్టీఆర్ బర్త్ డే.. దుమ్మురేపిన జపాన్ ఫ్యాన్స్.
క్యాన్సర్ భూతాన్ని పారదోలే అద్భుత ఫలం..
క్యాన్సర్ భూతాన్ని పారదోలే అద్భుత ఫలం..
తిరుపతి గంగమ్మ జాతరలో తుది ఘట్టం అదే.. వేల సంఖ్యలో భక్తులు..
తిరుపతి గంగమ్మ జాతరలో తుది ఘట్టం అదే.. వేల సంఖ్యలో భక్తులు..
ట్విస్టులే ట్విస్టులు.. కావ్య షాక్.. టెన్షన్‌లో సుభాష్, రాజ్!
ట్విస్టులే ట్విస్టులు.. కావ్య షాక్.. టెన్షన్‌లో సుభాష్, రాజ్!
వార్మప్ మ్యాచ్ నుంచి తప్పుకున్న కోహ్లీ, సిరాజ్, శాంసన్.. ఎందుకంటే
వార్మప్ మ్యాచ్ నుంచి తప్పుకున్న కోహ్లీ, సిరాజ్, శాంసన్.. ఎందుకంటే
అధిక రక్తపోటు ఎంత ప్రమాదమో తెలుసా? నిర్లక్ష్యం చేశారో ఇక అంతే..
అధిక రక్తపోటు ఎంత ప్రమాదమో తెలుసా? నిర్లక్ష్యం చేశారో ఇక అంతే..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!