
అల్పపీడనం ప్రభావంతో గత మూడు రోజులు రెండు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే తాజాగా తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు విస్తరించిన ఉన్న ఉపరితల ద్రోణి, ఒడిశా-బెంగాల్ తీరాల మీదుగా కొనసాగుతన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రెండు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
తెలంగాణలో వాతావరణం
ఇక తెలంగాణపైనూ ఉపరితల ద్రోణి ప్రభావం ఉన్నట్టు వాతవారణ శాఖ తెలిపింది. ఈ రోజు తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని.. ముఖ్యంగా మధ్య, తూర్పు తెలంగాణలో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే మధ్యాహ్నం వరకు వాతావరణ కాస్త తేమ, ఉక్కపోతతో అసౌకర్యంగా ఉండొచ్చని.. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు మాత్రం భారీ ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీలో వాతవారణం
వాతావరణ శాఖ ప్రకారం.. ఈ మంగళ, బుధ వారాల్లో కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే నంద్యాల, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో.. మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే వర్షాల సమయంలో గంటలకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని స్పష్టం చేసింది.
ప్రజలకు అలర్ట్
ఈ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పిడుగుల పడే అవకాశం ఉన్నందున వర్షాలు కురిసే సమయంలో ప్రజలు ఎవరూ చెట్ల కింద, కరెంట్ పోల్స్ కింద ఉండొద్దని అధికారులు సూచించారు. భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లోని ప్రజలు అత్యవసరమైతే తప్పా ఇంటి నుంచి బయటకి రావొద్దని సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.