Immadi Ravi: సినిమా పైరసీ.. ఐబొమ్మ ఓనర్ ఇమ్మడి రవికి 5 రోజుల కస్టడి!

ఐబోమ్మ రవి పైరసి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐ బొమ్మ కేసులో అరెస్ట్ అయిన ఇమ్మడి రవిని కోర్టు పోలీసు కస్టడికి అనుమతించింది. రవిని ఐదు రోజుల కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో త్వరలోనే రవిని కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు పోలీసులు.

Immadi Ravi: సినిమా పైరసీ.. ఐబొమ్మ ఓనర్ ఇమ్మడి రవికి 5 రోజుల కస్టడి!
Ibomma

Updated on: Nov 19, 2025 | 4:41 PM

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పైరసీ మూవీ రాకెట్ ఐ బొమ్మ కీలక సూత్రధారి ఇమ్మడి రవిని సీసీఐ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో తాజాగా కీలక పరిణాయం వెలుగు చూసింది. ఐబొమ్మ రవికి కోర్టు కస్టడీ విధించింది. ఐబొమ్మ సినిమా పైరసీ కేసులో గత నాలుగు రోజుల క్రితం ఇమ్మడి రవిని హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో తాజాగా అతన్ని కస్టడీకి కోరుతూ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

పోలీసులు పిటిషన్‌ను పరిగణలోకి తీసుకున్న నాంపల్లి కోర్టు.. విచారణ జరిపింది. ఈ కేసులో ఇమ్మడి రవిని ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో ప్రస్తుతం జైల్లో ఉన్న ఇమ్మడి రవిని సైబర్‌ క్రైమ్ పోలీసులు త్వరలోనే కస్టడీకి తీసుకోనున్నారు. ఈ కస్టడీలో రవి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టాలని పోలీసులు చూస్తున్నారు.

ఇదిలా ఉండగా రవి కేసులోకి అటు ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది. బెట్టింగ్‌ యాప్స్‌ నుంచి ప్రకటనల రూపంలో ఇమ్మడి రవికి విదేశీ అకౌంట్ల నుంచి భారీ మొత్తంలో డబ్బులు ముట్టాయని తెలంగాణ పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో మనిలాండరింగ్ జరిగి ఉండొచ్చని ఈడీ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కేసుపై ఈడీ కూడా విచారణ జరపున్నట్టు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించిన వివరాల కోసం పోలీసులకు లేఖ రాసినట్టు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us