బాగా పనిచేస్తేనే మళ్లీ ఎమ్మెల్యే టికెట్.. పదేళ్ల వరకు నేనే సీఎం.. కార్యవర్గ సమావేశంలో కేసీఆర్

ఆరు గంటలపాటు తెలంగాణ భవన్‌లోనే గడిపిన కేసీఆర్.. పార్టీ సంస్థాగత వ్యవహారాలపై నేతలకు హితబోధ చేశారు.

బాగా పనిచేస్తేనే మళ్లీ ఎమ్మెల్యే టికెట్.. పదేళ్ల వరకు నేనే సీఎం.. కార్యవర్గ సమావేశంలో కేసీఆర్

Updated on: Feb 08, 2021 | 7:17 AM

 CM KCR in TRS General body meeting : తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు పై కొంత కాలంగా జరుగుతున్న ప్రచారంకు ఫుల్ స్టాప్ పెట్టారు సీఎం కేసీఆర్. తానే సీఎంగా ఉంటా అని.. ఇకపై ఎవరైనా ఆ అంశంపై మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని నేతలకు సూటిగా తేల్చి చెప్పారు కేసీఆర్. ఒకటి కాదు రెండు కాదు ఆరు గంటలపాటు తెలంగాణ భవన్‌లోనే గడిపిన కేసీఆర్.. పార్టీ సంస్థాగత వ్యవహారాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు.

టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం తెలంగాణ భవన్ లో జరిగింది. పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాల పై సీఎం కేసీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు అంటూ నేతలు మాట్లాడుతున్న తీరుపై సమావేశంలో సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.. వరుసగా సీఎం మార్పుపై నేతలు మాట్లాడాన్ని కేసీఆర్ తప్పుబట్టారు.నేనే సీఎంగా ఉంటానని నేతలకు తేల్చి చెప్పారు కేసీఆర్. ఇకపై ఎవరైనా ఈ అంశంపై మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇటు పార్టీ సంస్థాగత నిర్మాణం పై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఫిబ్రవరి 12 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని టీఆర్ఎస్ ప్రారంభిస్తుంది. ఫిబ్రవరి నెలాఖరు లోపు సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని నేతలకు డెడ్ లైన్ పెట్టారు కేసీఆర్. ఇక మార్చి నెలలో గ్రామ స్థాయి నుంచి.. జిల్లా స్థాయి వరకు పార్టీ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ నెలలో రాష్ట్ర కమిటీ ఏర్పాటుతో పాటు.. పార్టీ ప్లీనరీ నిర్వహించనున్నట్లు కేసీఆర్ తెలిపారు. ఇటు ఏ జిల్లా నాయకులు ముందుకు వస్తే ఆ జిల్లాలో బహిరంగ సభ నిర్వహిస్తామని సమావేశంలో కేసీఆర్ స్పష్టం చేశారు.

మరోవైపు, గ్రేటర్ హైదరాబాద్ మేయర్,డిప్యూటీ మేయర్ అభ్యర్థుల పేర్లను సీల్డ్ కవర్ లో ఈ నెల 11 న ఇస్తామని పార్టీ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ ప్రకటించారు. 11న గ్రేటర్ ప్రజాప్రతినిధులు కార్పొరేటర్‌లతో కలిసి తెలంగాణ భవన్ రావాలని.. భవన్ లో సమావేశమయ్యాక, జీహెచ్‌ఎంసీ వెళ్లాలని ఆదేశించారు.. .దింతో మేయర్ ఎవరు అన్నది ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతుంది.. మేయర్ ఎన్నిక బాధ్యతను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అప్పగించారు కేసీఆర్.

మొత్తానికి 6 గంటల పాటు తెలంగాణ భవన్ లో బిజీబిజీగా గడిపిన కేసీఆర్ అనేక అంశాలపై చర్చిండమే కాకుండా మంత్రులును సైతం వదలలేదు. జిల్లాల్లో ఎమ్మెల్యేలను మంత్రులు విస్మరించడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుండి ఎమ్మెల్యేలకు తెలియాకుండా నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమాలు చేయద్దని హెచ్చరించారు.

Read Also…  పెద్దిరెడ్డికి ఫ్రీడమ్‌ దొరికింది, కానీ నోటికి తాళం పడింది. ఎస్ఈసీ ఆంక్షలపై మండిపడుతున్న వైసీపీ నేతలు

Loading...
Unable to load recommendations.
Follow Us