
హైదరాబాద్ పరిధిలోని కబ్జాకి గురైన చెరువులు, ప్రభుత్వ భూములను కాపాడేందుకు రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన సంస్థ హైడ్రా. అయితే ఈ సంస్థకు కమిషన్‌ర్ విధులు నిర్వహిస్తున్న రంగనాథ్ గత కొన్ని రోజులుగా కబ్జా కోరుల నుంచి ప్రభుత్వ భూములతో పాటు చెరువులను స్వాధీనం చేసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో తమ భూములను కాపాడుకునేందుకు కొన్ని ప్రైవేట్ కాలేజీలు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ఫైర్ NOCలు సృష్టించిన సృష్టించినట్టు తేలడం ఇప్పుడు నగర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది.
నగరంలోని సుమారు 8 ప్రైవేట్ కాలేజీలు హైడ్రా కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఫైర్ NOCలు సృష్టించాయని. వాటితో ఇంటర్మీడియేట్ బోర్డ్‌కి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశాయని అధికారులు గుర్తించారు. ఈ డాక్యుమెంట్స్‌పై అనుమానం వచ్చి ఆరా తీయగా అవి నకిలీ ఫైర్ NOCలుగా బయటపడింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ఈ 8 ప్రైవేట్ కాలేజీల ఫోర్జరీ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటు తెలంగాణ ఇంటర్మీడియేట్ బోర్డ్ సైతం ఈ కాలేజీల గుర్తింపును రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన కాలేజీ లిస్ట్‌లో బర్కత్‌పురాలోని హైందవీ జూనియర్ కాలేజీ, SR నగర్‌లోని రెసోనెన్స్ జూనియర్ కాలేజీ, మెహిదీపట్నంలోని ప్రియాంక జూనియర్ కాలేజీ , విద్యానగర్‌లోని మదర్స్ గాళ్స్ జూనియర్ కాలేజీ , చంద్రాయణగుట్టలోని శ్రీచైతన్య జూనియర్ కాలేజీ , చిక్కడపల్లిలోని న్యూఎరా జూనియర్ కాలేజీ , శివరాంపల్లిలోని షాహీన్ జూనియర్ కాలేజీ, తెల్లాపూర్‌లోని వశిష్ట జూనియర్ కాలేజీలు ఉన్నట్టు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,