Viral Video: వినాయకుడిని నిమజ్జనం చేస్తూ.. నదిలో పడిపోయిన యువకుడు.. ఇదిగో వీడియో!

రంగారెడ్డి జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. గణేష్ నిమజ్జనం చేసేందుకు వెళ్లి ఓ యువకుడు గణేషుడితో పాటు మూసీ నదిలో పడిపోయాడు. అయితే నీరు ఎక్కువగా లేకపోవడంతో ఆ యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Viral Video: వినాయకుడిని నిమజ్జనం చేస్తూ.. నదిలో పడిపోయిన యువకుడు.. ఇదిగో వీడియో!
Ganesh Visarjan Viral Video

Updated on: Sep 24, 2026 | 9:46 PM

వినాయకుడిని నిమజ్జనం చేసేందుకని వెళ్లి ఓ యువకుడు మూసీ నదిలో పడిపోయిన ఘటన రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌పల్లి సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కొందరు యువకులు స్థానికంగా వినాయకుడిని ఏర్పాటు చేశారు. అయితే మూసీ నది వద్ద పోలీసులు సూచించిన స్థలంలో కాకుండా.. మరోచోట నిర్లక్ష్యంగా గణేష్ నిమజ్జనం చేసేందుకు ప్రయత్నించారు. వారిని స్థానిక మున్సిపల్ అధికారులు అడ్డుకోగా, సదరు యువకులు వారితో దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది.

అధికారులు ఎంత చెప్పినా వినకుండా యువకులు అక్కడే వినాయకుడిని నిమజ్జనం చేశారు. అయితే నిమజ్జనం చేసే సమయంలో విగ్రహానికి ఉన్న ఇనుప రాడ్ ఓ యువకుడి టీషర్ట్‌కు తగులుకోవడంతో విగ్రహంతో పాటు అతను కూడా నదిలో పడిపోయాడు. అయితే నదిలో లోతు తక్కువగా ఉండటం, నీరు ఎక్కువగా లేకపోవడంతో అతను ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు. దీంతో అక్కడున్న వారంతా ఊపిరిపీల్చుకున్నారు.

అక్కడే ఉన్న కొందరు ఈ దృశ్యాలను ఫోన్‌లో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై మున్సిపల్ అధికారులు పోలీసులకు సైతం ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us