తెలంగాణలోని హైదరాబాద్ పరిధిలో నేడు, రేపు నీటి సరఫరాను ఆపివేస్తున్నట్టు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. గోదావరి జలాల సరఫరా రెండు రోజుల పాటు అంతరాయం ఏర్పడటంతో.. నీటి నిల్వ తక్కువగా ఉన్న కారణంగా నీటి సరఫరా ప్రక్రియ నిలిచిపోనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పథకం ప్యాకేజీ -13లో భాగంగా ఇరిగేషన్ శాఖ గ్రావిటీ కెనాల్ నిర్మాణం జరుగుతున్నది. గజ్వేల్ మండల పరిధిలోని కోడకండ్ల గ్రామం వద్ద నగరానికి వచ్చే గోదావరి 3000 ఎంఎం డయా పైపులైన్ ఈ కెనాల్ నిర్మాణానికి అడ్డుగా వచ్చిన కారణంగా.. ఈ భారీ పైపులైన్ ఇతర చోటికి మారుస్తున్న క్రమంలో ఇరిగేషన్ శాఖ విజ్ఞప్తి మేరకు జలమండలి అధికారులు 48 గంటల పాటు షట్‌డౌన్ ప్రకటించారు.
నీటి సరఫరా రాని ప్రాంతాలు:
1. డివిజన్-6: ఎర్రగడ్డ, బోరబండ, ఎల్లారెడ్డి గూడ, యూసుఫ్ గూడ, ఎస్సార్ నగర్, అమీర్‌పేట్, సనత్ నగర్, జూబ్లిహిల్స్
2. డివిజన్-9: కూకట్ పల్లి, కేపీహెచ్‌బీ, మూసాపేట, బాలానగర్, భాగ్య నగర్, భరత్ నగర్, బోరబండ రిజర్వాయర్ నిధి
3. డివిజన్-12: చింతల్, జీడిపెట్ల, షాపూర్ నగర్, సురారం, జగద్గిరి గుట్ట, కుత్బుల్లాపూర్
4. డివిజన్-13: డిఫెన్స్ కాలనీ, గౌతం నగర్, ప్రశాంత్ నగర్, చాణక్యపురి, మల్కాజిగిరి
5. డివిజన్-14: న్యూ ఓయూ సిటీ, కైలాసగిరి
6. డివిజన్-15: మియాపూర్, మాతృశ్రీ నగర్, మయూరి నగర్, చందానగర్, హఫీజ్ పేట
7. డివిజన్-18: నిజాంపేట, బోచుపల్లి, బొల్లారం
8. డివిజన్-19: బాలాజీ నగర్, కీసర, జవహర్ నగర్, నాగారం, చేర్యాల్
9. డివిజన్-21: సీఆర్‌పీఎఫ్, మెస్, కంటోన్మెంట్ బోర్డు పరిధి, తుర్కపల్లి