కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై సొంత పార్టీ నేతలే దుమ్మెత్తిపోస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ కాదన్నారు. ఎవ్వరినీ సంప్రదించకుండా ఇష్టం వచ్చినట్లు చేస్తావా..? అంటూ రేవంత్‌పై మండిపడ్డారు. నీపై ఆరోపణలు వస్తే నిరూపించుకోవాల్సింది పోయి.. వేరే వారిపై ఆరోపణలు చేయడం ఏంటని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి వ్యవహారంపై పార్టీలో చర్చ జరగాలని, 111 జీవో పరిధిలో కాంగ్రెస్ వాళ్లకే ఎక్కువ ఫామ్ హౌస్‌లు ఉన్నాయని వీహెచ్ పేర్కొన్నారు. ఎవరికి వారు కార్యక్రమాలు చేస్తే ఎలా..? అని వీహెచ్ మండిపడ్డారు.
మరోవైపు ఎమ్మెల్యే జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్సనల్ ఎజెండాను పార్టీపై రుద్దాలని చూస్తే ఊరుకోమంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు సొంత డబ్బా కొట్టుకోవడం కరెక్ట్ కాదంటూ సెటైర్లు వేశారు. జైలుకు వెళ్లినంత మాత్రాన పదవులు దక్కుతాయా అంటూ జగ్గారెడ్డి ప్రశ్నించారు.
ఇదిలా ఉంటే తాజాగా రేవంత్ రెడ్డికి కోర్టులో చుక్కెదురైంది. హైదరాబాద్ కూకట్‌పల్లి కోర్టు బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. జన్‌వాడాలో డ్రోన్ ఎగరవేసిన కేసులో రేవంత్‌కు బెయిల్ నిరాకరించింది. డ్రోన్ ఎగరవేసిన కేసులో మొత్తం 8మందిపై కేసు నమోదు కాగా.. వీరిలో రాజేంద్రనగర్ కోర్టు ఆరుగురికి బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా చర్లపల్లి జైలులో ఉన్నారు రేవంత్ రెడ్డి.
Read This Story Also: సీఎం జగన్ టీమ్‌లోకి కొత్త ‘ఉప ముఖ్యమంత్రి’?