TSRTC: రేపట్నుంచి బస్సుల బంద్.? సజ్జనార్ ఏమన్నారంటే.? క్లారిటీ ఇదిగో..

టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హైదరాబాద్‌ బస్ భవన్‌లో అద్దె బస్సు ఓనర్లతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. వారం రోజుల్లో వారి సమస్యల పరిష్కారం చేస్తామన్నారు సజ్జనార్‌. సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటి వేస్తామన్నారాయన. రేపటి నుంచి ఎప్పటిలాగే అద్దె బస్సులు నడుస్తాయన్నారు.

TSRTC: రేపట్నుంచి బస్సుల బంద్.? సజ్జనార్ ఏమన్నారంటే.? క్లారిటీ ఇదిగో..
TSRTC

Updated on: Jan 04, 2024 | 1:33 PM

టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హైదరాబాద్‌ బస్ భవన్‌లో అద్దె బస్సు ఓనర్లతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. వారం రోజుల్లో వారి సమస్యల పరిష్కారం చేస్తామన్నారు సజ్జనార్‌. సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటి వేస్తామన్నారాయన. రేపటి నుంచి ఎప్పటిలాగే అద్దె బస్సులు నడుస్తాయన్నారు. సంక్రాంతికి కూడా ఫ్రీ బస్ సర్వీస్ ఉంటుందన్నారు స్పష్టం చేశారు సజ్జనార్‌. పండుగ రద్దీ మేరకు స్పెషల్ బస్సులను కూడా తిప్పుతామన్నారు. మరోవైపు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆర్టీసీ ప్రైవేట్ బస్సు యాజమాన్య సంఘం సభ్యులు కలిశారు. అద్దె బస్సుల సమస్యలను పరిష్కరించాలంటూ మంత్రి పొన్నంకు వినతిపత్రమిచ్చారు.