Hyderabad: చారిత్రక కట్టడాలు భవిష్యత్తు తరాల వారికి అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి

|

Apr 18, 2022 | 6:58 PM

హైదరాబాద్(Hyderabad) పాత బస్తీలో నిజాం కాలం నాటి చారిత్రక కట్టడాలను(Historical Monuments) భవిష్యత్ తరాల వారికి అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. చరిత్రాత్మక కట్టడాల పునరుద్ధరణ, ఇన్నోవేషన్ చేసి పాత వైభవాన్ని...

Hyderabad: చారిత్రక కట్టడాలు భవిష్యత్తు తరాల వారికి అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి
Historical Monuments
Follow us on

హైదరాబాద్(Hyderabad) పాత బస్తీలో నిజాం కాలం నాటి చారిత్రక కట్టడాలను(Historical Monuments) భవిష్యత్ తరాల వారికి అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. చరిత్రాత్మక కట్టడాల పునరుద్ధరణ, ఇన్నోవేషన్ చేసి పాత వైభవాన్ని తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 90.45 కోట్ల వ్యయంతో నిధులు మంజూరు చేసింది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో పనులు చేపట్టనున్నారు. పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ, శాసన సభ్యులు, రాష్ట్ర మంత్రులతో కలిసి రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటిఆర్(KTR) శంకుస్థాపన చేయనున్నారు. మంగళవారం చరిత్రాత్మక కట్టడాల నిర్మాణ పనులకు, రిహాబిలిటేషన్ ఆఫ్ సేవెరేజ్ నెట్వర్క్ శంకుస్థాపనలతో పాటు బహదూర్ పుర ఫ్లై ఓవర్ ను కూడా మంత్రి కేటిఆర్ ప్రారంభిస్తారు. రూ. 2.కోట్ల 55 లక్షల వ్యయంతో మీర్ ఆలాం చెరువులో మ్యూజికల్ ఫౌంటెన్ పనులకు శంకుస్థాపన చేస్తారు. రూ.108 కోట్ల ఖర్చుతో పూర్తి చేసిన బహదూర్ పుర ఫ్లైఓవర్ ను ప్రారంభిస్తారు.

చార్మినార్ వద్ద మహబూబ్ చౌక్ (ముర్గి చౌక్) పునరుద్ధరణ పనులను రూ.36 కోట్ల వ్యయంతో చేపడుతున్నారు. రూ.21.90 కోట్ల అంచనా వ్యయంతో చార్మినార్ జోన్ లో మీర్ ఆలాం మండి పనులకు, సర్దార్ మహల్ అభివృద్ధికి రూ. 30 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేస్తారు. అంతేకాకుండా కార్వాన్ అసెంబ్లీ నియోజక వర్గం లో HMWSSB ద్వారా 297.30 కోట్ల అంచనా వ్యయం తో జోన్ 3 లో రిహబిలిటేషన్ ఆఫ్ సేవరేజ్ నెట్ వర్క్ చేపట్టే పనులనూ మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు.

Also Read

Uttam Kumar Reddy: తెలంగాణ ప్రభుత్వంపై మాజీ పీసీసీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Ice Facial: వేసవిలో ఐస్ క్యూబ్స్‏తో ముఖంపై రుద్దుతున్నారా ?.. అయితే ఈ విషయాలను తెలుసుకోండి..

Acharya: భలే భలే బంజారా సాంగ్ వచ్చేసింది.. చిరంజీవి, రామ్ చరణ్ మాస్ స్టెప్పులు అదుర్స్..