పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన‌ కేసీఆర్!

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం రోజు అన్ని గ్రామాల్లో సంబరాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ రోజు(బుధవారం) తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ కార్యవర్గం భేటీ అయింది. ఈ భేటీలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లు, మున్సిపల్ ఎన్నికలు, పార్టీ సభ్యత్వ నమోదు, జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణంపై చర్చించారు. త్వరలోనే టీఆర్ఎస్ కమిటీల నియామకం చేపడతామని కేసీఆర్ తెలిపారు. ఈనెల 27న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కమిటీతో […]

పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన‌ కేసీఆర్!
Follow us

| Edited By:

Updated on: Jun 19, 2019 | 6:43 PM

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం రోజు అన్ని గ్రామాల్లో సంబరాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ రోజు(బుధవారం) తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ కార్యవర్గం భేటీ అయింది. ఈ భేటీలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లు, మున్సిపల్ ఎన్నికలు, పార్టీ సభ్యత్వ నమోదు, జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణంపై చర్చించారు. త్వరలోనే టీఆర్ఎస్ కమిటీల నియామకం చేపడతామని కేసీఆర్ తెలిపారు.

ఈనెల 27న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కమిటీతో పార్టీ అధినేత కేసీఆర్ సమావేశం కానున్నారు. అదే రోజు నుంచి నెల రోజుల పాటు టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టనున్నారు. పార్టీ కార్యాలయాల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం రూ. 19.2 కోట్ల నిధులు కేటాయించారు. ఒక్కో జిల్లాలో టీఆర్ఎస్ భవనానికి రూ.60 లక్షలు కేటాయించారు. నామినేటెడ్ పోస్టుల్లో రాష్ట్ర కమిటీ సభ్యులకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు