Telangana: ‘మాకు లైట్ బీర్లే కావాలి’.. లేదంటే బీరోద్యమమే అంటున్న తాగుతోతుల సంఘం

అధిక ఉష్ణోగ్రతలతో, మండుటెండలతో ఇబ్బందులకు గురవుతున్న తమకు కింగ్ ఫిషర్ లైట్ బీర్ తాగితే సేదతీరుతామని తరుణ్ తెలిపారు. నెల రోజులుగా మద్యం దుకాణాలలో వాటి అమ్మకాలు నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.

Telangana: 'మాకు లైట్ బీర్లే కావాలి'.. లేదంటే బీరోద్యమమే అంటున్న తాగుతోతుల సంఘం
Beer
Follow us

|

Updated on: May 06, 2024 | 7:12 PM

ఓవైపు ఎండలు దంచి కొడుతున్నాయి. మరో వైపు చిల్‌కు చిల్లు పడుతోంది. సమ్మర్‌ హీట్‌ను బ్రేక్‌ చేసేలా కూల్‌ కూల్‌ బీర్లతో చిల్‌ అవుదామనుకునే మందు బాబుల ఆశలకు కృత్రిమ కొరత తూట్లు పొడుస్తోంది. నో స్టాక్‌ బోర్డులతో మందుబాబులు ఊసురుమంటున్నారు. నిజానికి ఎండాకాలం గిరాకీతో వైన్‌ షాప్‌ల్లో గల్లా పెట్టెలు బాగానే గలగలమన్నాయి. ఎండలు, ఎన్నికల హీట్‌తో లిక్కర్‌ సేల్స్‌ ఆమాంతం పెరిగాయి. కానీ ఇప్పుడు మచ్చుకైనా బీరు దొరకడంలేదు. ఎక్కడికెళ్లినా నో స్టోక్‌ బోర్డు వెక్కిరిస్తోంది..

సమ్మర్‌లో బీర్ల డిమాండ్‌ మద్యం వ్యాపారులకు ఏకంగా 36 వేల 493 కోట్ల రాబడి తెచ్చిపెట్టింది. గత నెల 6కోట్ల బీర్ల విక్రయాలు జరిగాయి. ఇక డెయిలీ కమ్‌ సే కమ్‌ 20 లక్షలకు పైగా బీర్లు కూల్‌కేక్‌లా సోల్డ్‌ ఔట్‌. ఇదంతా ఒకవైపు. ఇక రెండో వైపు ఈ వారం సడెన్‌గా బీర్ల కొరత ఏర్పడింది. ఏ షాప్‌ దగ్గరకు వెళ్లిన నో స్టాక్‌ బోర్డ్‌ వెక్కిరిస్తోంది. ఇదంతా కృత్రిమ కొరత అని ఆరోపిస్తున్నారు వినియోగదారులు. డిమాండ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు స్టాక్‌ లేదని చెప్తూ బ్లాక్‌మార్కెటింగ్‌ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తాగుబోతుల సంఘం ఏకంగా ఉద్యమానికి సిద్ధమైంది. వైన్‌ షాప్‌ల నిర్వాహాకులు బెల్టు షాప్‌లతో సిండికేటయి బ్లాక్‌ మార్కెట్‌ దందా చేస్తున్నారని ఆరోపించారు తాగుబోతుల సంఘం అధ్యక్షుడు కొట్రంగి తరుణ్ . అధిక ఆల్కహాల్ ఉన్న బీర్లు సేవిస్తే అనారోగ్యానికి గురువుతున్నామని..  వాంతులు, విరేచనాలు అవుతున్నాయని చెప్తున్నాడు అతడు. మత్తులో ఏ పనులు చేసుకోలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఎన్నో రోజులుగా తమకు అలవాటు ఉన్న కింగ్​ ఫిషర్​ లైట్​ బీర్లను తిరిగి అందుబాటులో ఉండేలా చూడాలని డిమాండ్​ చేశాడు.  మాముళ్ల కిక్కుతో ఎక్సైజ్‌ అధికారులు కిక్కురమనడంలేదని ఆరోపించారాయన. మండే ఎండల్లో చల్లని బీరు దొరక్క ఎంతో మంది ఆవేదన చెందుతున్నారన్నారు. ఇప్పటికైనా లైట్‌ బీర్లను అందుబాటులోకి తేవాలన్నారు. లేదంటే బీరోద్యామాన్ని ఉధృతం చేస్తామన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం